శివ స్తుతి

on 0 comments Read Full Article



ప్రాతః స్మరామి భవ భీతి హరం సురేశం
గంగాధరం వృషభ వాహనం అంబికేశం
ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం
సంసార రోగ హరమౌషధమద్వితీయం

ప్రాతః నమామిగిరిశం గిరిజార్ధ దేహం
స్వర్గ స్థితి ప్రళయ కారణమాది దేవం
విశ్వేశ్వరం విజిత విశ్వ మనోభి రామం
సంసార రోగ హరమౌషధమద్వితీయం

ప్రాతః భజామి శివమేకమనంతమాద్యం
వేదాంత వేద్యమనఘం పురుషం మహాంతం
నామాది బేధ రహితం చ షట్ భావ శూన్యం
సంసార రోగ హరమౌషధమద్వితీయం

ప్రాతః సముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యేనుదినం పఠంతి
తే దుఃఖ జాతం బహు జన్మ సంచితం
హిత్వా పదం యాంతి తదేవ శంభో !


దేవి ఆరాధన

on 1 comments Read Full Article


అమ్మవారి అర్చన
**************************************

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెదమమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

లంకలో వెలసిన శాంకరి దేవికి, తలంటి నీళ్లు పోసేదమమ్మా!
కాంచీపుర శ్రీ కామాక్షమ్మకు, కాంచన చేలము కట్టెదమామ్మా!

వంగ దేశపు శృంఖల దేవికి, కుంకుమ తిలకము దిద్దెదమమ్మా!
క్రౌంచ పురమున చాముండాంబాకు, పాపట సింధురముంచెదమమ్మా!

అలంపురీ జోగులాంబకు, పసుపు పారాణి పెట్టెదమమ్మా!
శ్రీ పర్వత భ్రమరాంబికకు, కాటుక కళ్ళకు దిద్దెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెదమమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

కొల్హాపురి మహాలక్ష్మిదేవికి, గజ్జెల గాజులు కూర్చెదమమ్మా!
మాహుర్యేక వీర మాతకు, బంగారు నగలు పెట్టెదమమ్మా!

ఉజ్జయినీ పురి కాళికాంబకు ,జాజులు జడలో తురిమెదమమ్మా!
పిఠాపురమ్మున పురుహూతికకు, మంచి గంధము పూసేదమమ్మా!

భౌజ పురమున గిరిజా దేవికి, కల్యాణార్చన చేసెదమమ్మా!
ద్రాక్షారామ మాణిక్యాంబకు, పరిమళ ధూపము వేసెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెద మమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

హరిపురి శ్రీ కామ రూపిణికి, పాలు ఫలములు ఒసగేదమమ్మా!
ప్రయాగ మాధవేశ్వరికి, పాయస సమర్పణ చేసెద మమ్మా!

జ్వాలాముఖి శ్రీ వైష్ణవి దేవికి, దక్షిణ తాంబూల మిచ్చెద మామ్మా!
గయలో మంగళ గౌరీ దేవికి, జయ నీరాజన మిచ్చెద మమ్మా!

వారణాశి శ్రీ విశాలాక్షికి, వాహన సేవలు చేసెదమమ్మా!
కాశ్మీరంబున సరస్వతి మాతకు, నమ: శ్శతంబులు చేసెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెద మమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !
***************************************


పద్దెనిమిది పీటాలలో వెలసిన పరమేశ్వరిని షోడశోప చార పూజ చేసేందుకు ఈ పాట కూర్చ బడింది. ఈ పాత పాట వ్రాసిన దేవరో తెలియదు కాని అందంగా వ్రాసారు. ఇది చదివి అమ్మకు మానసిక పూజ చేసుకోవచ్చు.కార్తిక మాసం పుణ్యమైన మాసం.భక్తి ప్రపత్తులకు అనువైన మాసం.ఈమాసమంతా ,మరీ పౌర్ణమిదాకా అన్ని ముఖ్య మైన తిథులే! సోమవారాలు అభిషేకాలు,క్షీరాబ్ధి ద్వాదశి , ఏకాదశి ,కార్తీక పౌర్ణమి అన్నీ ఇట్టే గడిచిపోతాయి. వన భోజనాలు పుణ్యము, పురుషార్దము అన్నట్లుగా ,అందరు కలిసి భోజనాలు చేయడం, సామూహికంగా పూజలు చేసుకోవడం నయనానంద కరంగా వుంటాయి. నీరెండలో కూర్చుని ఉత్తమ గ్రంధాలు చదవడం,ఇతరులకి వినిపించడం మనశ్శాంతిని కలిగిస్తుంది.భగవదారాధనకి సమయం నిర్ణయించ నక్కరలేదు. `మనం పడుకొని ప్రార్ధిస్తే ఆయన కూర్చుని విన్టాడట. హరి హరుల నిద్దరిని పూజించే కార్తీక మాసం పుణ్యాన్ని పంచి పెడుతుంది.

on 1 comments Read Full Article



తులసి స్తోత్రము

on 1 comments Read Full Article

తులసి స్తోత్రము

దీపావళి వెళుతూనే కార్తిక మాసం ,స్నానాలు,ఉపవాసాలు,శివ మహాదేవునికి అభిషేకాలు, బిల్వపత్రార్చనలు ,కార్తిక దీపం ఒకటే సంరంభం. తులసి దగ్గర నెలరోజులు దీపం వెలిగించి "సర్వే జనా స్సుఖినో భవంతు "అని ఆశిర్వదించ మని ఆతల్లిని ప్రార్దిస్తాము.క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి కల్యాణం .ఆ సందర్భముగా తులసి స్తోత్రము చదువుకోండి.
తులసి స్తోత్రము
జగద్ధాత్రి నమస్తుభ్యం విశ్ణోచ ప్రియ వల్లభే!
యతో బ్రహ్మాదయో దేవ:సృష్టిస్తిత్యంత కారిణ:
నమస్తులసి కల్యాణి నమో విష్ణు ప్రియే శుభే
నమో మోక్ష ప్రదే దేవి నమ: సంపత్ప్రదాయికే
తులసి పాతుమాం నిత్యం సర్వాపద్యోపి సర్వదా
కిర్తితా వాపి స్మృతా వాపి పవిత్రయతి మానవం
నమామి శి రాసా దేవిం తులసీం విలసత్తమం
యాం దృష్ట్వా పాపినో మర్త్యా:ముర్చ్యన్తే సర్వ కిల్బిశాత్
తులస్యా రక్షితం సర్వం జగదేత చ్చరాచరం
యా వినర్హంతి పాపాని దృష్ట్వా పాపి భిర్నరై:
నమస్తూ లస్యతి తరాం యస్యై బాధ్వాబలిమ్తతా
కాలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యా స్తదాపరే
తులస్యన్నపరం కించిత్ దైవతం జగతి తలే
యాయా పవిత్రతో లోకో విష్ణు సంగేన వైష్ణవ:
తులస్యాం పల్లవం విష్ణో శిరస్యారోపితం కలౌ
ఆరోపయతి సర్వాణి శ్రేయామ్సి వర మస్తకే
తులస్యాం సకలా దేవా వసంతి సతతం యత:
అతస్తా మర్చయే లోకే సర్వ దేవాన్పమర్చయన్
నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభౌ
పాహిమాం సర్వ పాపెభ్యం సర్వ సంపత్ప్రదాయికే
ఇతి స్తోత్రం పురా గీతం పున్డరీకేణ ధీమతా
విష్ణు మర్చయితా నిత్యం సోభావై స్తులసి దలై :
తులసీ శ్రీ మహా లక్ష్మి విద్యా విద్యా యశస్విని
ధర్మ్యా ధర్మ నవాదేవి దేవ దేవ మన: ప్రియా
లక్ష్మి ప్రియ సఖి దేవి ద్యౌర్భూమి రచలా చలా
షోడా శైతాని నామాని తులస్యాం కిర్తయన్నర:
లభతే సుతరాం భక్తి మన్తే విష్ణు పదం లభేత్
తులసీ భూర్మహా లక్ష్మి:పద్మినిశ్రీ ర్హరిప్రియా
తులసీ శ్రీ సఖి శుభే పాప హారిణి పుణ్య దే
నమస్తే! నారద నుతే! నారాయణ మన: ప్రియే హ్రీం
**********************