శ్రీ రామ మంగళాశాసనం

on 0 comments Read Full Article

శ్రీ రామ మంగళాశాసనం
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాభ్దయే!
చక్రవర్తి తనూజాయ సార్వ భౌమాయ మంగళం

వేదవేదాంత వేద్యాయ మేఘ శ్యామల మూర్తయే
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం

విశ్వామిత్రాంత రంగాయ మిథిలా నగరీ పతే
భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం

పిత్రు భక్తాయ సతతం భాతృభి: సహ సీతయా
నందితాఖిల లోకాయ రామ భద్రాయ మంగళం

త్యక్త సాకేత వాసాయ చిత్ర కూట విహారిణే
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం

సౌమిత్రిణాచ జానక్యా చాప బాణాసి ధారిణే
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం

దండకారణ్య వాసాయ ఖరదూషణ శత్రవే
గృధ్ర రాజాయ భక్తాయ ముక్తి దాయాస్తు మంగళం

సాదరం శబరీ దత్త ఫలమూల భిలాషిణే
సౌలభ్య పరిపూర్ణాయ సత్యోద్రిక్తాయ మంగళం

హనుంత్సమవేతాయ హరీశాభీష్ట దాయినే
వాలి ప్రమధ నాయాస్తు మహాధీరాయ మంగళం

శ్రీమతే రఘు వీరాయ సేతూల్లంఘిత సింధవే
జితరాక్షస రాజాయ రణ ధీరాయ మంగళం


విభీషణ కృతే ప్రీత్యా లంకాభీష్ట ప్రదాయినే
సర్వలోక శరణ్యాయ శ్రీ రాఘవాయ మంగళం

ఆగత్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా
రాజాధి రాజ రాజాయ రామ భద్రాయ మంగళం

భ్రహ్మాది దేవసేవ్యాయ భ్రహ్మణ్యాయ మహాత్మనే
జానకీ ప్రాణ నాథాయ రఘు నాథాయ మంగళం

శ్రీసౌమ్య జామాతృమునే: కృపయాస్మాను పేయుషే
మహతే మమ నాథాయ రఘు నాథాయ మంగళం

మంగళాశాసన పరై :మదాచార్య పురోగమై
సర్వైశ్చ పూర్వై రాచార్ర్యై : సత్కృతాయాస్తు మంగళం

రమ్యజా మాతృ మునినా మునినా మంగళా శాసనం కృతం
త్రైలోక్యాధిపతి:శ్రీమాన్ కరోతు మంగళం సదా







భావ నారాయణ స్వామీ

on 0 comments Read Full Article

ఆంధ్ర రాష్ట్రములొ వున్న పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలను కీర్తిస్తూ శ్రీ కాశిన వెంకటేశ్వర రావు గారు రచించిన గేయం .
" సర్పవరము " స్వామి నారాయణా!
సకల సంపదలిచ్చు నారాయణా!
సర్వమై నిలిచేవు నారాయణా!
భక్తినిమ్ము భావ నారాయణా!
"బాపట్ల" లో స్వామి నారాయణా!
భజనలే చేసేము నారాయణా!
బాధల్ని మాపేటి నారాయణా!
భద్రతిమ్ము భావ నారాయణా!
"భావ దేవరపల్లి" నారాయణా!
భోగ మందరికిచ్చు నారాయణా!
భవ్యముగ కీర్తించ నారాయణా!
భాష నిమ్ము భావ నారాయణా!
"పొన్నూరులో స్వామి నారాయణా!
పోగొట్టు పాపాలు నారాయణా!
పొగడగా మేమెంత నారాయణా!
భాగ్యమిమ్ము భావ నారాయణా!
"పట్టి సీమలొ " స్వామి నారాయణా!
గోదారి మధ్యలో నారాయణా!
నీసేవలే సేతు నారాయణా!
భావమిమ్ము భావ నారాయణా!
రచయితకు కృతజ్ఞ తలతో