సూర్య మహిమ

on 0 comments Read Full Article

                                   సూర్య మహిమ
                     శ్రీకృష్ణుని కుమారుడైన    సాంబునికి     శాప కారణంగా     భయంకరమైన   కుష్టు రోగం ప్రాప్తించింది.
సాంబుడు  తండ్రి దగ్గరికి వెళ్లి   "నా కష్టాన్ని దూరంచేయ్యండి.   రోగానివారణకు    ఉపాయం చెప్పండి "అని కోరాడు.
సూర్య భగవానుని     ఆరాధన చెయ్యి నాయనా !నీకు    ఆరోగ్యం వస్తుంది ,నారద మహర్షి  దగ్గర సూర్య  ఆరాధన ఎలా చేయాలో  తెలుసుకో!అన్నాడు.
                      నారద మహర్షి  ఒకసారి   శ్రీ  కృష్ణుని     దర్శనార్ధమై  ద్వారకాపురికి    వచ్చాడు. అప్పుడు సాంబుడు వినమ్రతతో     చేతులు జోడించి ప్రార్ధించాడు. నాశారీరాన్ని    ఆవరించిన  కుష్టు రోగం నివృత్తి అయేలా  ఏదైనా     ఉపాయం చెప్పి   పుణ్యం   కట్టుకోండి   అన్నాడు.
                           సమస్త ప్రాణికోటి  నిత్యమూ ఎవరినయితే     ప్రార్ధిస్తారో,నువ్వు  వారినీ ప్రార్ధిస్తే   నీ  రోగం నయమవుతుంది,నీ   కహ్తాలు గట్టేక్కుతాయి.
             ఆదైవం ఎవరో చెప్పండి,వారి శరణు    వేడుకొంటాను.
             ఆయన ప్రత్యక్ష దైవం    సాక్షా త్తు   సూర్యనారాయణ మూర్తి .మానవులు,దేవతలు నిరంతరమూ ఆయన్ని స్తుతిస్తూ   వుంటారు. ఆయన   ఎంతటి    మహిమ కలవాడో   చేపుతావిను ,ఒకసారి నేను      సూర్య లోకానికి  వెళ్లాను.దేవతలు,గంధర్వులు,నాగులు,యక్షులు ,రాక్షసులు,అప్సరసలు  ఆయనకు సేవలు చేస్తున్నారు.గంధర్వులు     గానమాలపిస్తోంటే    అప్సరసలు నృత్యం చేస్తున్నారు.రాక్షసులు,యక్షులు,నాగులు శ స్త్రాలు   ధరించి  రక్షణ గా  నిలబడ్డారు. ఋగ్వేదము,యజుర్వేదము,సామ వేదము    స్వరూపాలు ధరించి ఆయన్ని స్తుతిస్తున్నారు.ప్రాతః కాలము,మధ్యాహ్నము ,సాయం కాలము మూడు సంధ్యలు సుందర మైన రూపాలు ధరించిచేతిలో వజ్రము,బాణాలు ధరించి నాలుగు వేపులా  నిలబడ్డారు.ప్రాత;సంధ్య   బంగారు కాంతితో వుంది,మధ్యాన్న సంధ్య చంద్రునివలె   శ్వేత వర్ణంలో వుంది.  సాయం సంధ్య మంగళ వలే  విచిత్ర వర్ణాలతో వుంది.
ఆదిత్య,వసు,రుద్ర ,మరుత్,  అశ్వనీ కుమార్మోదలైన దేవగణా లందరూ త్రిసంధ్యాలలో సూర్యారాధన చేస్తున్నారు.
ఇంద్రుడు    ఎల్లవేళలా   అక్కడనిలబడి      జయజయకారాలు పలుకుతున్నాడు. గరుత్మంతుని పెద్ద అన్నసూర్యునికి రథ సారధి .  కాలుని       అవయవాలతో నిర్మించిన సూర్య రధాన్ని అతడు నడిపిస్తాడు. ఛంద  రూపంలోవున్న పచ్చని  ఏడు  గుర్రాలు   ఆరదానికి కట్టి వుంటాయి.  రాజ్ఞి,నిక్షుభ సూర్యుని ఇద్దరు భార్యలు   ఆయన చె రి ఒక వేపు   ఆసీనులై    వుంటారు. చేతులు జోడించి దేవతలన్దరు   చుట్టూ నిలిచి వుంటారు.పింగల్ ,లేఖక్, దండ నాయక గణాలు  ,కల్మాష  అనే రెండుపక్షులు ద్వారపాలకులై వుంటారు.  దిండీ ,బ్రహ్మ ఆయన్ని స్తుతిస్తూ వుంటారు
                     ఈద్రుశ్యం      చూసాక నాకు అనిపించింది,;ఈయనే దేవుడు, సమస్త దేవతలకు పూజనీయుడు :అనిపించింది, నువ్వు ఆ సూర్య నారాయణ మూర్తినే  శరణు వేడుకో!
                             సూర్యనారాయణు డు    సర్వగతుడు ఎలా అయాడు?ఆయన కిరణా లేన్ని?ఆయన రూపాలేన్ని?ఆయనభార్యలైన రాజ్ఞి, నిక్షుభ ఎవరు?పింగాల్,లేఖక్,దండనాయకక్కడ ఏమి చేస్తారు?కల్మాష పక్షి ఎవరు?ఆయన సమక్షం లో వుండే దిండి ఎవరు?నాకు   ఇంకావివరంగా చెప్పండి.అన్నాడు సాంబుడు
                                     వివస్వాన్       దేవుడు అవ్యక్త కారణ,నిత్య,అసత్ రూపం. ప్ర  ధాని,ప్రక్రుతి అని తత్వ చింతకులని అంటారు. వారు గంధ ,వర్ణ ,రస  రహితులు,శబ్ద ,స్పర్శ  రహితులు. సనాతన పర బ్రాహ్మలు. సమస్త ప్రాణులకు నియంతలు.     అనాది,అజ, సూక్ష్మ ,త్రిగుణ,నిరాకార,అవిజ్నేయ ,  పరమ పురుషులు.  ఈమహాత్ముడైన భగవాన్  సూర్యునిచే ఈజగత్తు పరివ్యాప్తమై వుంది.   ఈపరమెస్వరుని ప్రతిమ  జ్ఞాన ,వైరాగ్య లక్షణాలతో    విల సిల్లు తో వుంటుంది. వీరి బుద్ది   ధర్మమూ,ఐశ్వర్యము   ప్రసాదించేది.ఈభగవానుదు ఏది కోరుకొంటే  అది జరిగి తీరుతుంది.సృష్టి రచనా సమయం లో వీరు బ్రహ్మ మూర్తులు,ప్రళయ కాలంలోకాలరూపులు.పాలనా  సమయంలో విష్ణు స్వరూపులు.ఆదిదేవుడు గనుక ఆదిత్యుడు,అజాతుడు గనుక అజ అయి వున్నాడు.దేవతలలో గొప్పవాడు కనుక మహాదేవ్ అంటారు.సమస్త ప్ర జానీకాన్ని పాలించి,రక్షిస్తాడు కనుక   ప్రాజాపతి అయాడు.హిరణ్యా న్డం లోవుండటం వలన హిరణ్య గర్భుడు .దిశలకు ప్రభువు,దేవతలకు దేవుడు,గ్రహాలకు ఈశుడు కనుక దివాకరుడు అయాడు.ప్రళయ కాలం లో స్థావర జన్గామాలన్ని నశించి పోయినప్పుడు ప్రపంచం అంటా ఒక మహా సాగరం అయినప్పుడు ఈయననారాయన రూపం ధరించి సముద్రంలో శయనిస్తాడు. ఈయనే ప్రథమ దేవత. నువ్వు ఆయనని శరణు కోరితే ,ప్రార్ధిస్తే తప్పక నీకు శుభం కలిగి రోగము ఉపశమించి  దీ ర్ఘాయువు కాగలవు.అని నారదుడు చెప్పి నిష్క్ర మిస్తాడు.
                               ఆరోగ్య ప్రదాత,నేత్ర శక్తి నిచ్చే దేవత శ్రీ  సూర్యనారాయ ణు ని రథ సప్తమి సందర్భం గా తలచుకొని తరిద్దాము