నారాయణ శతకము గురుని విశిష్టత

on 0 comments Read Full Article

                      నారాయణ శతకము

పరిష్కర్త -పాతూరి సీతారామాంజనేయులు
                                                                   
                           గురుని  విశిష్టత

వేదాంత వేదియైన,సద్గురుని- పాద పద్మములు  చెంది
యా దయానిధి కరుణచే, సద్బోధ-మందవలె   నారాయణా!

ఏవిద్యకైన గురువు,లేకున్న-నా విద్య పట్టు పడదు
 కావునను నభ్యాసము ,గురుశిక్ష -కావలెను నారాయణా!

గురుముఖంబైన విద్య ,నెన్నికై-కొనిన భావజ్ఞానము,
చిరతరాధ్యాత్మ విద్య,నభ్యసిం -పగలేదు నారాయణా!అణా

అనపేక్షకుదు సదయుడు,వేదాంతి-నిపుణు డ య్యాచార్యుడు ,
దొరకు టపురూప మపుడు,గురుతైన-గురియొప్పు నారాయణా!

అట్టి సద్గురుని వెదకి,దర్శించి -యా మహాత్ముని పదములు,
పట్టి కృతకృత్యు డౌను ,సాధకుడు -గట్టిగా నారాయణా!





హరిహరాష్టోత్తరశతనామ స్తోత్రం

on 0 comments Read Full Article

   హరిహరాస్టోత్తర శత నామస్తోత్రమ్ 

శ్రీ శ్రీ కంఠ శ్శ్రీ నివాసో హ్యుమా కాంతో రమాపతి:
త్రిశూల భృ చ్చ క్ర పాణి ర్గంగా ధర మహీధరౌ 
మహాదేవో మహావిష్ణు:ఫాలాక్షఃకమలేక్షణ:
స్ఫటి కాచ్చో ఘనశ్యామో వృషాంకో గరుడధ్వజ:
పురారాతిర్మురారాతి ర్గిరీసో గిరిధా రక:
కృత్తివాసా పీతవాసా శ్శంకర శ్రీకర స్తథా :
మహేశ్వరో మహీకాంత: పంచ వక్త్రో హయానన: 
కామేశ స్సున్దరా కార:శ్రీ బిల్వ స్తులసీప్రియ:
   సదాశివ స్సదానందో  బిల్వ కేశశ్చ కేశ వ:
విష్ణు బాణో మోఘ బాణోగజారీ    గజ రక్షక:
స్కంద తాతో బ్రహ్మ పితా నటే శ :ఫణి తాండవ:
హలాస్యనాథో రంగేశో దృగాయుధ గదాధరౌ 
విశ్వేశ్వ రో విరాడ్రూప శ్శ ర్వ శ్సౌ రీ మృడొ చ్యుత:
దిగంబరాత్మా బుధ్ధా ఖ్య: కపర్దీ పురుషోత్తమ:
కాశీ బృన్దావనా వాసౌ త్రిభంగీశ స్త్రి విక్రమ:
తేజస్త్రయో ద్వంద్వ ద్రష్టి రష్ట మోర్తిర్దశాకృతి:
భూత నాథో జగన్నాథ శ్చంద్ర బర్హావ తంసక :
రుండ మాలా లసత్కంటో వనమాలా విభూ సహిత:
మృగాంక  శ్స్రీ వత్స చిహ్నో జటాచీరో జనార్దన:
దశా భుజ శ్చతు ర్బాహు పశ్వీ శ :పశు పాలక:
సాంబాత్మా సాంబజనకో నాగ వక్ర సుకుండ లౌ ,
ఈశాన శ్శన్శు మారాత్మా హరో   నారాయణస్తథా: 
స్థాణుర్విశ్వన్భర శ్చై వ పుష్పవచ్చక్ర లోచన:
వీరభద్ర:ప్రలంభఘ్నో గురుమూర్త్యాఖు వాహన:
ఈశ: కల్కీ వామదేవో వాసు దేవ: ప్రభు స్స్వ భూ:
మృత్యుంజయో మధు ధ్వంసీ కాలంతో   నరకాంతక:
మొహినీరూప సుప్రీతో మోహినీ రూప దారక:
గణే శ తాతః కందర్ప జనక శ్శ రభో వ్యయ:
బ్రహ్మ సారధ్య సంతుష్టః  పార్ధ సారధ్య  తత్పరః:
కేతకీ శాప కృ త్కృ ష్నో వృ ష తార్క్ష్య సువాహనౌ :
భూ రథా ఢ్యో ముకున్దశ్చ భీమో భీష్మ సుపూజిత:
టంక శంఖాంచిత కర స్స్న పనాలమ్కృతిప్రియ:
పంచాక్షర మంత్రార్ధ:కాల భైరవ  మాధవ:
మార్కండేయ పరిత్రాతృ ప్రహ్లాద పరి పాలక:
కపాల కౌస్తుభధర శ్శీవ రామో భవానఘ:
వేద వాజిత్రిదామస్తఃపార్దాస్త్ర జ్ఞాన దాయక:
ఖట్వాంగ నందక కరో రుద్రాక్ష:కమలాక్షభృత్ ,
సుమేరు సార్జ్న చాపోన్ధ కారి:కైటభ మర్దన:
బాణసద్మ ద్వారపాల బలీంద్ర ద్వారపాలక:
నాగేంద్ర హార పర్యంకో భయ కృ ద్భయ నాశన:
వటమూ ల  తటా వాసీ వటపత్ర పుటేశయ:
మహాలింగ సమూ ద్భూత: సభాస్తంభ సముద్భవ:
పార్వతీభూషి తార్ధాంగ లక్ష్మ్యా వాస హృదమ్బుజ:
అంగరూపా నంతరూపో లయకృత్ స్థితి కారక:
ఉన్మత్త శేఖర వర జార చోర శిఖా మణి :
జలంధరారి కంసఘ్నః:పరమేశ: పరాత్పర:
భస్మాసుర వరో ధ్ధాతృ ముచుకుంద వరప్రద:
నిత్యానంత శ్చోగ్ర శాంత స్తత్వ సాహస్ర శీ ర్ష క:
పరంజ్యోతి:  పద్మనాభో భృంగి స్త్యుత్య భృగు స్తుతః:
సామ వంశీ గాన లోలో భవ్య దామోదర స్తథా :
భవ రోగ భిష గ్ధన్వంతరి:కామార్య ధోక్షజ:
ఊర్ధ్వ కేశ హృ షీ కేశ: క్రతు ధ్వంసక రక్షక:
భస్మ చందన లిప్తాంగో భీమేశ మధు సూధన:
రుద్రో పేన్ద్ర శ్శమ్భ రారీ ర్జటా జూట కిరీట భృ త్ 
కైలాస వైకుంఠ వాసీ వాసుకీ జన సుప్రద:
కిరాత రూప గోవింద:పంచ బ్రహ్మాత్మక ధృవ:
శ్రీరాజరాజ వరద రాజేన్ద్రాన్వయ పాలక:
ఇదం హరి హరే శస్య నామ్నామశ్టోత్తరమ్ శతమ్ 
సర్వ పాప ప్రశమనమ్ సర్వ సామ్రాజ్య దాయకం 
అనేన పూజ్యయే ద్యస్తు సదేవస్య ప్రియో భవేత్ 
ఇతి హరిహరా ష్టో త్తర శత నామ స్తోత్రమ్ 

కార్తీక మాసం ఒక్క శివుని కోసమే కాదని ,విష్ణు భగవానుని కూ డా   సేవించమని పెద్దలు చెపుతారు. ఈ స్తోత్రం తో వీరిని  సేవించండి.  



                             

హర హర మహా దేవ్

on 0 comments Read Full Article

                 హర హర   మహాదేవ్

సత్య సనాతన  సుందర     శివ -సబకే    స్వామీ -అవికారీ అవినాశీ - అజ అంతర్యామీ !
ఆది   అనంత   అనామయ -సకల  కళా దారీ -అమల -ఆరూప అగోచర   అవిచల   అఘ హారీ !హరహర
బ్రహ్మా,విష్ణు ,మహేశ్వర   తుమ్    త్రిమూర్తి   దారీ-కర్తా,భర్తాధర్తా    తుమ్ హీ     సంహారీ !
రక్షక్ ,భాక్షక్  ,ప్రేరిక్ ప్రియ    ఔధరదానీ -సాక్షీ  పరమ    ఆకర్తా,కర్తా,అభిమానీ!  హరహర
మణిమయ   భవన  నివాసీ -అతి  భోగీ    రాగీ!-సదా శ్మశాన-విహారీ  యోగీ    విరాగీ!
ఛాల్కపాల్   ,గరల     ముండ  మాలా ,వ్యాలీ -చితా   భస్మ  తను ,త్రినయన ,అయన     మహా కాళీ !హరహర
ప్రేత ,పిశాచ ,సుసేవిత ,పీట  జటా దారీ-వివ సన   వికట    రూప ధర రుద్ర   ప్రళయ  కారీ !
శుభ్ర,సౌమ్య ,సురసరి ధర ,శశిధర   సుఖ కారీ -అతి కమనీయ ,శాంతి కర శివ,ముని మన హారీ!హరహర
నిర్గుణ -సగుణ ,నిరంజన    జగమయ   నిత్య   ప్రభో-కాల రూప   కేవల హర -కాలాతీత    విభో!
సత్ ,చిత్,ఆనంద ,రసమయ   కరుణా మాయ   దాతా-ప్రేమ,సుధా,నిది ,అఖిల విశ్వ -త్రాతా !హరహర
హమ్  అతి   దీన దయామయ-చరణ శరణ  కీజై -సబ్   విధి     నిర్మల మతికర అపనా కర లీజి    హరహర
          ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
పాత పాట    ఎవరు   వ్రాసారో    తెలియదు . అనంగీకారమైతే    తొలగిస్తాను,తెలియ చెయ్య   మని    వినతి .

పరమేశ్వర ప్రార్ధన

on 0 comments Read Full Article

               శివస్తుతి                పరమేశ్వర ప్రార్ధన

          శృంగారపురంలొ   నివసించిన   శ్రీ నాగేశ్వరం   సుందర శర్మ గారు  శ్రీ భగవన్నామ సంకీర్తన మాల అనే  కీర్తనలు రచించి పుస్తకం ప్రకటించారు.ఇది అమూల్యం .భక్త వరేణ్యులకు   ఒక్కొక్కరికి    ఒక్కొక్క పుస్తకం ఉచితంగా పంచాలని సంకల్పించి   ఆ రోజుల్లొ   పోస్ట్ ఖర్చులకు   రెండు అణాల పోస్ట్ బిళ్ళలను పంపిస్తె    పుస్తకం పంపుతానని   వెనక అట్టమీద ప్రచురించారు.ఆపుస్తకం   యాదృచ్చికం గా    నాదగ్గరికి చేరింది.  శివ స్తుతులు   హృద్యమంగా వున్నాయి.  కార్తీక మాస సందర్భంగా    వీటిని   గుడిగంటలు  బ్లొగ్ మిత్రులకు   అందిద్దామని   అనిపించింది.  విజ్ఞాపన లో విళంబి ,అధిక శ్రావణం ,13, సోమవారం అనివుంది. రచయితకు   కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.
జ్ఞాన ప్రసూన
                    పరమేశ్వర ప్రార్ధన
       శ్లోకము
       మాతాచ పార్వతీ దేవీ ,పితాదేవో మహేశ్వర:
       బాంధవా: శివ భక్తాచ ,స్దేశొ భువన త్రయం
                  కల్యాణి రాగం -ఆట తాళం
             దేవాది దేవా బ్రోవ రావా
             దేవ బ్రోవా వేగ రావా
             దేవా-కావా-రావా-శివా    దే
        1.ఆదిమధ్యాంత రహితా -ఆనందమయ  సుచరితా
          వేదవిహిత యోగివినుత-ఆది దేవ అమర వందిత     దే
        2.జగములను సృజించి -మరితగునేర్పునబెంచి
          పగలేక యడంచి -జగములేలు నీ లీలనుంచి      దే
        3.సర్వ వేద  కర్త వీవె -సర్వ మత ప్రవక్త వీవె
          సర్వ భక్త  గమ్య మీవె -యుర్వి భేదము లణచి కావవె   దే
        4.రజత గిరి నివాసా -రంజిత గౌరి విలాసా
          విజిత మన్మధ రోషా -భుజ భూష  భక్త సుపోష      దే
        5.మూడు కనులు గల్గు వాడా -చూడుము దయ నను చంద్ర చూడా
          వేడితి గంగను దాల్చు రేడా - వేగమె కావర -తెల్లరేడా  దే
        6.దాపుజేరితిని మంచి-ప్రాపు నీవనచునెంచి
          [నా] పాపముల ద్రుంచి -కృప వహించి దీనుని గాంచి     దే
        7.అన్ని జన్మములలో-హన్న  మానవ జన్మములో
         నిన్ను సన్నుతింపక ,మదిలో-బన్నుగ జన్మ తరింపదు -భువిలో దే
        8.తనయులు తగు భార్య యున్న-
          ధనగృహ క్షేత్రాదులున్న -తన తోడుత రాకయున్న
          తన విధి తప్పింప లేరన్న                              దే
        9.తల్లితండ్రి గురువు నీవే -యెల్ల బంధు మితృ లీవే
          కల్లగాదు నా   దైవము నీవే -వల్లభ- కరుణించిరావే  దే
        10.స్నాన సంధ్య జపము -దాన ధర్మ  తపము
           జగద్ వల్లభ కరుణించి రావే                           దే
        11.ధరను వెలయు శృంగార -పుర విహార మల్లేశ్వర
           వర సుందర నుత ధీరా -కరుణ రత్న హార మిదే గొనర దే
                 

దీపావళి శుభాకాంక్షలు

on 0 comments Read Full Article