Showing posts with label దేవి. Show all posts
Showing posts with label దేవి. Show all posts

దేవీ నవరాత్రుల లో పూజలు

on 1 comments Read Full Article

దేవీ నవరాత్రులలో పూజలు
దేవీ నవరాత్రులలో దుర్గా దేవికి లేక లలితకు ప్రతి రోజు సహస్ర నామాలు పూజ చేస్తారు.సాయం సంధ్య వేళలో అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించి త్రిశతి పారాయణ చేయడం శ్రేయస్కరము .స్తోత్రాలు,మంగళ హారతులు పాడుకొంటారు.ఈ తొమ్మిది రోజుల లో ఇంటికి వచ్చిన వారికీ పసుపుకుంకుమ లిచ్చి పంపుతారు.
ఈ పండగ రోజుల లో ఒకొక రోజు ఒకొక దేమునికి అశ్టో త్తరము చేస్తారు.
ఈ సంవత్సరము నవరాత్రులు శని వారమునాడు మొదలవుతున్నాయి.
శని వారము -వెంకటేశ్వర స్వామికి
ఆదివారము -సూర్యనారాయణ మూర్తికి
సోమ వారము -శివునికి
మంగళ వారము -ఆంజనేయ స్వామికి
బుధవారము -సరస్వతికి
గురువారము -షిర్డీ సాయి నాధునికి
శుక్ర వారము -శ్రీ మహాలక్ష్మికి
మళ్ళి శనివారము అదే వరస.

దుర్గా సప్త శతి ప్రార్ధన శ్లోకాలు

on 0 comments Read Full Article

దుర్గా సప్త శతి ప్రార్ధన శ్లోకాలు
ఉత్తరాదిన దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గా సప్త శతి శ్లోకాలు
పారాయణ చేస్తారు .తొమ్మిది రోజులు అన్నం తినరు.ఉడక బెట్టిన బంగాళా దుంపలు, సగ్గుబియ్యముతో చేసిన వంటలు తిని వుంటారు. దుర్గా సప్త శతిలొ ఈక్రింది శ్లోకాలు మహత్తర మైనవి.ఇవి ఆ తొమ్మిది రోజులు పారాయణ చేస్తే కుటుంబములో అందరికి సుఖము, శాంతి
లభిస్తాయి.
ఓం జ్ఞానినా మాపి చేతాంసి దేవీ భగవతీ హిసా
బలదాక్రుష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి

ఓం దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో:

స్వస్థ్తై స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్య దు:ఖ భయ హారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా
ఓం సర్వ మంగళ మాన్గల్యే శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

ఓం శరణాగత దీనార్త పరుత్రాన పరాయణే
సర్వ స్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే

ఓం సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే
భాయేభ్య స్త్రాహినో దేవి దుర్గేదేవీ నమోస్తుతే

ఓం రోగానసేషా నాప హంసి తుష్టా
రుష్టాతు కామాన్ సకలా నభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణామ్
త్వామాశ్రి తాహ్య శ్రయతాం ప్రయాతి
ఓం సర్వ బాధా ప్రశమనం త్ర్యై లోక్య స్యాఖి లేస్వరి
ఎవ మేవ త్వయాకార్య మస్మద్వైరి వినాశనం

దేవీనవరాత్రులు -రంగులు

on 0 comments Read Full Article

దేవీ నవరాత్రులు వస్తున్నాయంటే ఇళ్ళల్లో ,దేవాలయాలలో ఒకటే సందడి. తొమ్మిది రోజులు వరుసగా
చేసుకొనే ఈపూజల పండుగకి ముందే కొన్ని ఏర్పాట్లు చేసుకొని ,ఒక పధకము ఏర్పాటు చేసుకొని దాని ప్రకారము నడుచుకొంటే సులువుగా వుంటుంది. దేవీ నవరాత్రులలో అమ్మవారికి అక్షింతలతో పూజచేస్తాము. ఆఅక్షింతలు
మంచి బియ్యం చూసి, గింజ నడుము విరిగినవి ఏరివేసి పూర్తిగా వున్నా బియ్యపు గింజలనే ఉపయోగించాలి.avi నవరాత్రులకి ముందుగానే ఏరుకొని అట్టి పెట్టుకోవాలి.కొన్ని బియ్యము రామనామము స్మరిస్తూ ఏరుకొని వాటితో
నవరాత్రులలో అమ్మవారికి పాయసం చేసి నైవేద్యము పెడితే మంచిది. పమిడి పట్టి తెచ్చుకొని నలకలు లేకుండా
బాగు చేసుకొని అయుదు వరసలు వుండేలా వత్తులు ,బొడ్డు వత్తులు చేసుకొని ఆవునేతిలొ తడిపి ఒక భరిణెలొ
పెట్టుకొంటే తయారుగా వుంటాయి,నేతిలో నాని ఎక్కువ సేపు దీపం వెలుగుతుంది.
నవరాత్రులలో ఏరోజు ఏరంగు వస్త్రాలు కట్టుకొంటే మంచిదో ఒక చోట చదివాను.
అమ్మవారిని కొందరు పెద్ద విగ్రహాలు చేయించి నవరాత్రులలో ప్రతిష్ట చేసి పూజిస్తారు. ఈరంగులచీరలు అమ్మవారికి కూడా ధరింపచేయ్యాలి
పాడ్యమి -చిలక పచ్చ రంగు
విదియ -నారింజ రంగు
తదియ -పసుపు పచ్చ రంగు
చవితి -ఆకాశ నీలం రంగు
పంచమి -గులాబీ రంగు
షష్టి -గచ్చకాయ రంగు
సప్తమి -ఆకు పచ్చ రంగు
అష్టమి -నేరేడు పండు రంగు
నవమి -కృష్ణ నీలం రంగు
దశమి -ఎర్రరంగు
వీ లయితే ఆచరించండి.
,

దుర్గ స్తుతి

on 0 comments Read Full Article

జయ నారాయణి జయజయ దుర్గే
జయ జయ అంబే నమోనమః
తేరా పావన సుమిరణ కరతే
అంతరమే సుఖ్ భార ఆతే
రోమ్ రోమ్ మే ప్రేమ తిహారా
బనకే భక్తీ బిఖర్ జాతా
జయ కల్యాణి జయ జయ దుర్గే
జయజయ అంబే నమో నమః
మాన్ అంతర్ కే మంత్ర బనో తుం
జీవన్ ఎ గుంజారో మా
జనమ జనమ కే సంగ్రామొంకా
తేజ్ సే ఆపని జలాదో మా
జయ రుద్రాణే జయజయ దుర్గే
జయజయ అంబే నమో నమః
మంగళ తాకీ దేనే వాలే
మన వాంచిత ఫల బరసాయే
ద్వారా తిహార్ ఆకే మయ్యా
కో ఈ ఖాళి నహీ జాతే
జయ బ్రహ్మాణీ జయజయ దుర్గే
జయజయ అంబే నమో నమః
ధ్యాన్ భజన హం నిసిదిన్ కరతే
మనమే జపతే నామ విమల్
శరణ పరేకో ఏక సహారా
మయ్యాతేరే చరణ కమల్
జయతి శివానీ జయజయ దుర్గే
జయజయ అంబే నమో నమః


రచయిత పేరు తెలియదు,క్షమించాలి.

దేవినామాలు

on 0 comments Read Full Article

విశాలాక్షి ,
లింగధారిని ,
లలిత ,
కాముకి ,
కుముద ,
విశ్వకామా ,
విస్వకామప్రపూరిని ,
గోమతి ,
మదోత్కటా ,
జయంతి ,
గౌరీ ,
రంభా ,
కీర్తిమతి ,
విశ్వేశ్వరి ,
పురుహూత ,
సంమార్గదాయిని ,
మానదా ,
భద్ర కర్నికా ,
భవాని ,
బిల్వపత్రికా ,
మాధవీ ,
భద్రా ,
జయా కమలా ,
రుద్రానీ ,
కాళి ,
మహాదేవి , ,
కపిలా ,
ముకు టేస్వరి ,
కుమారి ,
లలితాంబికా ,
మంగళా ,
విమలా ,
ఉతపలాక్శి
మహోత్పలా ,
అమోఘాక్షి ,
పాటలా ,
నారాయణి ,
విపులా ,
కల్యాణి ,
ఏకవీరా ,
చంద్రికా ,
రమణా ,
మృగావతి ,
కోటవి ,
సుగందా ,
త్రిసంద్యా ,
రతిప్రియా ,
సుభానందా ,
నందిని ,
రుక్మిణి ,
రాదా ,
దేవకీ ,
పరమేశ్వరి ,
సీత ,
వింధ్య వాసిని ,
మహాలక్ష్మి ,
ఉమా ,
ఆరోగ్యా , ,
అభయ ,
నితంబా ,
మాండవి ,
స్వాహా ,
ప్రచండా ,
చండికా ,
వరారోహా ,
పుష్కరావతి ,
దేవమాతా ,
పారావారా ,
మహాభాగా ,
పింగలేస్వరి ,
సింహికా ,
అతిసాంకరి,
ఉత్పల ,
లోలా ,
లజ్ష్మి ,
అనంగా ,
విశ్వముఖీ ,
తారా ,
పుష్టి ,
మేధా ,
భావాసుద్ధి ,
మాటా ,
ధారా ,
ధృతి ,
శివదారిని,
అమృతా ,
ఊర్వసి ,
ఆస్ది ,
కుసోదకా ,
మన్మధా ,
సత్యవాదిని ,
వందనీయా ,
నిధి ,
గాయత్రి ,
పార్వతి ,
ఇంద్రాణి ,
సరస్వతి ప్రభా ,
వైష్ణవి ,
అరుంధతి ,
తిలోత్తమా ,
బ్రహ్మకల .