Showing posts with label భావ నారాయణ స్వామీ. Show all posts
Showing posts with label భావ నారాయణ స్వామీ. Show all posts

భావ నారాయణ స్వామీ

on 0 comments Read Full Article

ఆంధ్ర రాష్ట్రములొ వున్న పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలను కీర్తిస్తూ శ్రీ కాశిన వెంకటేశ్వర రావు గారు రచించిన గేయం .
" సర్పవరము " స్వామి నారాయణా!
సకల సంపదలిచ్చు నారాయణా!
సర్వమై నిలిచేవు నారాయణా!
భక్తినిమ్ము భావ నారాయణా!
"బాపట్ల" లో స్వామి నారాయణా!
భజనలే చేసేము నారాయణా!
బాధల్ని మాపేటి నారాయణా!
భద్రతిమ్ము భావ నారాయణా!
"భావ దేవరపల్లి" నారాయణా!
భోగ మందరికిచ్చు నారాయణా!
భవ్యముగ కీర్తించ నారాయణా!
భాష నిమ్ము భావ నారాయణా!
"పొన్నూరులో స్వామి నారాయణా!
పోగొట్టు పాపాలు నారాయణా!
పొగడగా మేమెంత నారాయణా!
భాగ్యమిమ్ము భావ నారాయణా!
"పట్టి సీమలొ " స్వామి నారాయణా!
గోదారి మధ్యలో నారాయణా!
నీసేవలే సేతు నారాయణా!
భావమిమ్ము భావ నారాయణా!
రచయితకు కృతజ్ఞ తలతో