ఆది శంకరాచార్య జయంతి

on 0 comments Read Full Article




శ్రీ ఆది శంకరాచార్యుల వారు భారతావని లో జన్మించి మానవాళికి మహోపకారం చేసారు.అతి క్లిష్టమైన వేదాంత విషయాల్ని ఒకపక్క వివరించి, మరొకపక్క పరమ పవిత్రమైన నాలుగు పీఠాలను భారత దేశపు నాలుగు దిక్కులా స్థాపించి , మరొకపక్క ఆధ్యాత్మిక లోకపు సరిహద్దులలోకి పయనించేందుకు మెట్లుగా,దీపకళిక ల్లాగా, సులువైన తోవల్లాగా ఎన్నో స్తోత్రాలు,స్తుతులు,అష్టకాలు,రచించారు.అన్నీ మానవుల ఎదుటపెట్టి చదువుకొని తరించండి అని
దీవించారు. అతి పిన్న వయస్సులో ఆయన చేసిన రచనలు పండితులని కూడా అబ్బుర పరిచాయి. అర్ధం అయినా కాకపోయినా వేదము విన్నపుడు ఒకరక మైన శాంతి ,ఒకరక మైన తృప్తి,ఒకరకమైన పవిత్రతా భావం మనిషికి కలుగుతుంది.అలాగే శ్రీ శంకరాచార్యులవారి కవితలు చదువుతూంటే అమోఘ మైన భక్తి భావం పొంగుతుంది. విశేష మేమిటంటే ఆయన రచనలోని ఎ పదమైనా ఎక్కువ అనిపించదు,ఒక్కపదం తీసిదాని స్థానంలో మరోపదం ఎవ్వరూ పెట్టలేరు. గొప్ప కళాకారుని వలె మాటలు వజ్రాలు ,కెంపులు ,ముత్యాలు ,పచ్చలు పొదిగినట్లు పొదిగారు.
వారిని తలుచుకొని ఒక్క అష్టకం చాడువుకొందాము.

శ్రీమదచ్యుతాష్టకం

అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్ ,రామకృష్ణ పురుషోత్తమ విష్ణో ,వాసుదేవ భాగవన్ననిరుద్ద శ్రీపతే!శమయ దుఃఖ మశేషం
విశ్వ మంగళ విభో జగదీశ నందనందన నృసింహ నరేంద్ర ,ముక్తిదాయక ముకుంద మురారే!శ్రీ పతే!శమయ దుఃఖ మశేషం
రామ చంద్ర రఘునాయక దేవ దీన నాథ దురితక్షయ కారిన్
యాదవేంద్ర యదుభూషణ యజ్న శ్రీపతే!శమయ
దేవకీ తనయ దు:ఖ దవాగ్నే రాదికారమణ రమ్య సుమూర్తే!
ద:ఖ మోచన దయా ర్నవ నాథ శ్రీపతే శమయ
గోపికావదన చంద్ర చకోరా నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో
పూర్ణ రూప జయశంకర శర్వ శ్రీపతే శమయ
గోకులేశ గిరి ధారణా ధీర యామునాచ్చాతట ఖేలన వీర
నారదాది ముని వందిత పాద శ్రీపతే!శమయ దు:ఖ మశేషం
ద్వారకాధిప దురంతా గుణాబ్దే ప్రాణనాథ పరిపూర్ణ భవారే!
జ్ఞాన గమ్య గుణసాగర భ్రహ్మన్ శ్రీమతే శమయ దు:ఖ మశేషం
దుష్ట నిర్దళన దేవ దయాళో!పద్మ నాభ ధరణీ ధర ధన్విన్
రావనాన్టక రమేశమురారే!శ్రీపతే!శమయ దు:ఖ మశేషం

అచ్యుతాష్టక మిదం రమణీయం నిర్మితం భవ భయం విని హన్తుం ,య:పఠే ద్విషయ వ్రుత్తి నివృత్తిం జన్మ దు:ఖ మఖిలం స జహాతి.


ఇతి శ్రీ శంకరాచార్య విరచిత మచ్యుతాష్టక స్తోత్రం .

************************************

నిత్య ప్రార్ధన

on 0 comments Read Full Article

నిత్య ప్రార్ధన
ఒ!పరమాత్మా!దేవా!శుధ్ధ అనంత శక్తి స్వరూపా!జ్ఞాన స్వరూపా!ప్రేమమయ మూర్తీ!జ్యొతి స్వరూపా! దేవాధి దేవా!పరమ కృపా సాగరా!నమస్కారం.మళ్ళీ మళ్ళీ నమస్కారం.
ఓ!విశ్వ స్వరూపా! విశ్వాతీతా!అద్వితీయ పరమేశ్వరా !నన్ను నీవాణ్ణీ చేసుకో!పూర్తిగా నీవాణ్ణీ చేసుకో!నన్ను రక్షించు ప్రభూ!నేను నీవాడిని!నాతప్పు,ఒప్పులతో నీ శరణాగతి వేడుకొంటున్నాను.
ఓ!సర్వేశ్వరా! నా శరీరం ఆరోగ్యంగా వుండాలి.నా సర్వేంద్రియాలు పవిత్రం గా వుండాలి.నా బుధ్ధి సుస్థిరంగా వుండాలి.నాభావాలు పవిత్రం గా వుందాలి.
ఓ!ప్రభూ!నా జీవితం వికసించి,మీ సేవలొ,మీ భజనలో.మీ స్మరణలో,మీ చింతనలో గడిచిపోవుగాక!పరం దయామయా!మిమ్మల్ని దర్శించేలా,సత్యాన్ని పాటించేలా దీవించు.
ఓ!పూర్ణ స్వరూపా!నా అసంపూర్ణత్వాన్ని పూర్ణత్వంలోకి మార్చు.నన్ను నీలో చేర్చుకు పరి పూర్ణుడిని చేయి.అందరూ సద్గతిని పొందాలి.అందరూ సుఖంగా వుండాలి.అందరూ ప్రేమగా వుండాలి.అందరి జీవితాలు కల్యాణ ప్రదమవాలి.

నిజాయితీ

on 0 comments Read Full Article

నిజాయితీ
అనగనగా ఒక వూళ్ళో కట్టేలుకొట్టుకొనే అతను ఒకడు ఉండేవాడు.శీలవంతుడు,పరమార్ధం ఎరిగినవాడు,సరళ స్వభావుడు.ఇతన్ని గురించి మహమూద్ అనేరాజు విని చూడాలని పిలిపించి అతని సాదుత్వానికి ముచ్చటపడి తన రాజ్యానికి ప్రధాన మంత్రిగా నియమించాడు.కట్టెలు కొట్టుకొని బ్రతికే ఇయాజ్ కి ఈపదవిపై ఏమాత్రం మోజులేదు,అయినా రాజాజ్నని తరస్కరించలేక అంగీకరించాడు.ఇయాజ్ ప్రధాన మంత్రి కాగానే రాజ్యంలో కట్టుదిట్టాలు ఎక్కువ చేసాడు.అన్యాయాలు,అత్యాచారాలు,భ్రష్టాచారాలు అన్నీ అంతరించిపోయాయి.
స్వార్ధ పరుల ఆట కట్టే సరికి వారికి ఇయాజ్ పై ద్వేషం పెరిగి రాజుగారికి రోజూ ఒక పితూరీ ఇయాజ్ ను గురించి అందించడం ప్రారంభించారు.వాళ్ళు చెప్పిన దేమిటంటే ఇయాజ్ కి ప్రధాన మంత్రి పదవి వచ్చినప్పటినుండీ చాలా వజ్రాలు,రత్నాలు పోగుచేసాడని, రాత్రి వేల ఏకాంతంగా కూర్చుని వాటిని చూసుకొని మురిసిపోతూ ఉంటాడని.
ఇయాజ్ దాచిన ఆ సంపదని చూడాలని రాజు ఇయాజతోచెప్పాడు.ఇయాజ్ వినమ్రంగా అంగీకరించి "మీ ఆజ్ఞా పాలన చేయడం నా విధి,కానీ రాజా !మీరు వాటిని చూడాలని కోరుకోవడం మంచిది కాదు,అన్నాడు.రాజు చూడాలని పట్టు పట్టాడు."మీ ఆదేశానుసారం చూపిస్తాను,కానీ నా పై వచ్చిన ఆరోపణలు అబద్ధం అని రుజువయితే నేనేది అడిగితె అది నాకు మీరు ఇయాలి.అన్నాడు ఇయాజ్.రాజు సంతోషంగా ఇస్తాను,దానికేమి భాగ్యం?అన్నాడు.రాజుగారు ముఖ్యోద్యోగులను పిలిపించారు,అందరూ ఇయాజ్ శయన మందిరంలో గుమిగూడారు.రాజు అందరి సమక్షములో ఇయాజ్ పెట్టె తెరిచాడు.అందులో రెండు పాత వస్త్రాలున్నాయి.ఇదేమిటి?అన్నాడురాజు .
"నేను బీదరికంలోంచి ప్రధాన పదవికి వచ్చాను.అధికారంతో నాకు అహంకారం రావచ్చు,అందుకని నాపూర్వపు రోజులు మర్చిపోకుండా ఈ పాత వస్త్రాలని రోజూ చూసుకొంటూ వుంటాను,అని ఇయాజ్ సమాధాన మిచ్చాడు.రాజు పులకిత గాత్రుడై "అయితే నీకు ఏమిబహుమానం కావాలో కోరుకో!అన్నాడు."నాకేమీ అఖ్ఖరలేదు,ఈపదవినుంది విముక్తి కలిగించండి అదేచాలు,నా శేష జీవితం పరమాత్ముని పాద సేవలో గడుపుకొంటాను,అన్నాడు ఇయాజ్."సాదువర్తనులైన వ్యక్తులు ఎల్లప్పుడూ సత్యమార్గాన్నే కోరుకొంటారు"అంటుంది వేదం .
{వేద సవితనుండి}