sravana maasammu
శ్రావణ మాసం
'శ్రావణ మాసం వచ్చే చీరల్లు చిరిగేనే
సుదతి నీ పుట్టింటి వారెలా రారు?
వానాకాలం వచ్చే వలు వ ల్లు చిరిగేనే
వనితా నీ పుట్టింటి వారెలా రారు?
ఉప్పాడ చీరల్లు కొని ఏల తేరు?"
అని మా బామ్మ పాడుతూ వుండేది. తెలుగు వారి ఇంట శ్రావణ మాసానికి ఎంత ప్రాముఖ్యతో చెప్పలేము. శ్రావణ మాసం వస్తోందంటే పండగలన్నీ వెంట బెట్టుకొని వస్తున్నట్లే!
వినాయక చవితి దసరా, దీపావళి, కార్తీకమాసం నాగుల చవితి ,అదుగో ఇదుగో అని సంక్రాంతి .కాలం ఎంత మారినా గ్రామాలలో మార్పులేదు.పండగ సందడి అంటే పల్లెల లోనే చూడాలి.
మట్టి ఇళ్ళల్లో వుంటే ముందుగా గోడలు బాగుచేసుకోవాలి. పెళ్ళలు ఊడిపోయిన చోట నాము సుద్ద గట్టిగా కలిపి వాటిని పూడ్చాలి. అవి ఆరాక సున్నమో,సుద్దో కలిపి గోడలకి వెల్ల వెయ్యాలి. పప్పులు తెప్పించి బాగుచేసి పెట్టుకోవాలి. శ్రావణ మాసం వచ్చిందంటే క్షణం తీరిక వుండదు.
కొత్తపెళ్లి కూతురు వుంటే మంగళ గౌరీ నోము నోయించడం, వియ్యాల వారు శ్రావణ పట్టీ తేవడం ,వారికి విందులు,మర్యాదలు. నాలుగు మంగళ వారాలు పూజ. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ,తెలుగింటి ఆడపడుచులందరూ తప్పక చేసుకొనే పూజ. లక్ష్మీ కటాక్షం ఉంటేనే సంసార శకటం సాఫీగా
నడుస్తుంది. లక్ష్మి అంటే డబ్బే కాదు, మాట వినే సంతానం, వినయంగా సేవ చేసే నౌకర్లు, సమృద్ధిగా పాలు,పెరుగు , ఆరోగ్యం, మనశ్శాంతి ఇవన్నీ లక్ష్మీ కటా క్షాలే! వీటన్నిటినీ ఇయ్యమని ఇల్లాలు లక్ష్మిని
మనసారా కొలుస్తుంది. కొత్త చీరలు కొనుక్కొన్నా ,ఎవరేనా పెట్టినా శ్రావణ మాసం వచ్చేదాకా గడి విప్పరు
వనితలు. నాలుగు మంగళ వారాలకి పేరంటానికి కొత్త చీర కట్టుకు వెళ్ళాలి,శుక్రవారం తప్పక కొత్త చీర కట్టుకోవాలి.
శ్రావణ మాసం వచ్చేసరికి ఇల్లు వాకిళ్ళు కడిగి ,ముగ్గులు పెట్టి , గడపలకి పసుపు కుంకాలు దిద్ది ,మామిడి తోరణా లతో గుమ్మాలు అలంకరించి శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతారు.
శ్రావణ మాసానికి మరో విశేషం వానలు. పేరంటాళ్ళు వాన చినుకుల్లో తడుస్తూ మధ్య మధ్య ఎ చూరు కిందో క్షణం నిలబడి మరో ఇంటికి పేరంటానికి పరుగెత్తడం. ఈ శ్రావణ మాసం రాగానే అందరికి '
తమ తమ అనుభవాలు జ్ఞాపకానికోస్తాయి.
నేను ఒక సంవత్సరం మోదేకుర్రులో నోములు నోచుకోన్నాను. మాతాతమ్మ నోయించింది.అప్పుడు ఇంట్లో గడియారాలు లేవు. తాతమ్మ ఖంగారులో ఎప్పుడో నిద్ర లేచి పూజకి అన్ని సిద్ధం చేసి నన్ను లేపేది. నేను పూజ చేసుకొనే సరికి ఇంకా దాసీది వచ్చేదికాదు. పల్లెటూళ్ళల్లో అయిదు గంటలకల్లా వచ్చేస్తారు. నేను పిల్లాన్ని ఒళ్లో వేసుకొని ఉయ్యాలా బల్ల మీద ఒక నిద్రతీసే దాన్ని, అప్పుడు తూరుపు రేకలారేవి,దాసీది వచ్చేది.శనగలన్నీ ఒక బుట్టలోవేసి,బియ్యపు పిండి,బెల్లం వేసి చేసిన ఉండ్రాళ్ళు తాంబూలం శనగల మీద పెట్టి అమ్మవారికి ముందు వాయనం ఇప్పించేది తాతమ్మ. ఆ తరవాతనే కాఫీ తాగడం. ఒఅకరికి ముందు వాయనం ఇచ్చిరంమని పంపెదినన్ను. వాళ్ళింటికి వెళ్ళే సరికి వా ళ్ళు తయారుగా వున్దేవారుకాదు. నన్ను కాసేపు కూర్చోపెట్టి వాయనం తీసుకొనే వారు.
తాతమ్మ ఇల్లు మండువా ఇల్లు. సూర్యుని ఎండా మండువా దాటి వంటింటి గడప తాకిందంటే చాలా పొద్దెక్కి నట్లు తాతమ్మ లెఖ్ఖ .అప్పుడు భోజనాలయిపోవాలి. వాటిల్లంతా శుభ్రం చేసేసుకొని,
రాత్రిళ్ళు తాగేందుకు తాతమ్మ మంచం కింద మరచెంబుతో మంచినీల్లుపెట్టి పక్క సవరించేయ్యాలి. అప్పటికి పది అయ్యేదేమో! మల్లి తాతమ్మ నన్ను తొందరపెట్టేది. నిన్ను పేరంటానికి పిలచిన వాళ్ళింటికి వెళ్లి
త్వరగా వాయనం పుచ్చుకురా! మల్లి మన ఇంట్లో పేరంటానికి వస్తారు.అనేది. నేను వెళ్లేసరికి వాళ్ళ పూజలు అఎవికావు. వాళ్ళ,అత్తలో,అమ్మలో ఆపిల్లల్ల్ని చివాట్లు వేసేవారు."చూడు బాలమ్మత్త మనవరాలు,పూజా అంతా చేసుకొని పేరంటానికి వచ్చింది. మీరింకా ఓనమ అనలేదు,జడ్డి మొహాలు"అని.బొట్టుపెట్టించుకొని వెనక్కి వచ్చేదాన్ని. ఆ పిల్లలు సాయంత్రం పేరంటానికి వచ్చినపుడు" ఏమే !నువ్వంత తొందరగా రాకే ! చివాట్లు పడుతున్నాయి"అని బతిమాలేవారు.
ఇంటికి రాగానే తాతమ్మ హాలులో చాపలు పరిచి,గంధం తీసి పెట్టమనేది. మూడు అయేసరికి పేరంటాళ్ళు రావడం ప్రారంభించేవారు. కొత్తపేట నుంచి ముత్తైదువ లందరూ ఒకేసారి వచ్చేవారు.
ఎదుగాజాల చీరలు కచ్చాపోసి కట్టుకొని ,నుదుట సూర్య బింబం అంట బొట్టు పెట్టుకొని ,కొప్పులో పూలు పెట్టుకొని ,కాళ్ళకి పసుపు తాసుకొని మె డలో నల్లపూసలతో వచ్చేవారు.అందరు దేవతా స్వరూపుల్లా వుండేవారు. తాతమ్మ నాచేత వాళ్ళందరికీ పారాణి ప్పెట్టించేది. వారికి గంధం రాస్తే, వాళ్ళు నాకు రాసేవాళ్ళు,ఏవేవో దీవన లిచ్చేవారు, అట్ల కాడకి పట్టిన నోము కాటుక ఇస్తే కళ్లకి పెట్టుకొని ఆచేయి తలకి రాసుకొని నావంక ముసిముసిగా నవ్వుతూ చూసేవారు. ఆకాటుక పెట్టుకొంటే జన్మ చరితార్ధ మయి నట్లే భావించేవారు.కళ్ళ ముందు ఈనాటికి ఆ పేరంటాళ్ళు కన్పిస్తారు.
ఈ జెట్ యుగం లో శ్రావణ్ మాసం ఎటు వస్తోందో ఎటు పోతోందో తెలియడం కష్టం గావుంది. విదేశాలలో వుంటే చెప్పక్కర్లా!ఏమిటో ఆలో చిస్తూ కూర్చున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. మంగళ
వారం పేరంటానికి రండి అని మా కోడల్ని పిలుస్తున్నారు. "తప్పకున్దావస్తా!అటు నాకు కొంచెం పని కూడా వుంది,మా అత్తగార్ని కడా తీసుకు వస్తా."అని చెప్పింది. "పసుపు,కుంకుమకి పదిమైళ్ళ దూరమైనా వెళ్ళాలి "అని అనే వారు. ఇప్పుడు అలా వెళ్ళే తీరిక లేదు. నోచుకొన్న వాళ్ళే పసుపుకుంకుమలు,పళ్ళు,వాయనం,కాటుక తీసుకు ఇంటికి వెళ్లి ఇచ్చి వస్తున్నారు. మేము వెళ్ళిన అమ్మాయికి ఒక పాప కూడా వునిది .కొందరి ఇంట ఆనవాయితీలో ముత్తైదువలు ప్రతిఏటా పెరుగుతారు.తోరానికి వేసేముల్లు,దీపాలు ఏడాదికి అయిదు చొప్పున పెరుగుతాయి. ఈంమయికి అలానే పదిహేను మందికి వాయన మ ఇచ్చుకోవాలి. పిల్లని తీసుకెళ్ళాలి. తెలుగువాళ్ళు అనితెలుస్తే చాలు వాళ్ళ అడ్రెస్ ,ఇంటి నంబరు తెలుసుకొని వాళ్లకి ఫోన్ చేసి రమ్మంటే వెళ్లి వాయనం ఇచ్చి రావాలి. అలా వెళ్ళిన పుడు వాళ్ళ పక్కిన్తివాల్లకి ఫోన్ చేసి మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు,వాయనం తీసుకోండి అనిఫోనే చేసి సహాయం చేసారు. శ్రద్ధగా అందరికి వాయనాలు ఇచ్చుకొన్దిఆ అమ్మాయి. వ్రతాలకి విశ్వాసమే ముఖ్యం. సంఘీభావం కూడా పెరుగుతుంది. మొత్తానికి ఇవాళ శ్రావణ లక్ష్మి గలగలలు వినిపించాయి.