muggulo gaNapati nRtya gaNapati

on 0 comments Read Full Article


ముగ్గులో గణపతి 

చాయా గణపతి

on 0 comments Read Full Article



చాయా గణపతి 

సిధ్ధి గణపతి

on 0 comments Read Full Article

సిద్ది గణపతి 

ఛత్ర గణపతి

on 0 comments Read Full Article

ఛ త్ర గణపతి 

పండగకి ముత్యాల ముగ్గు

on 0 comments Read Full Article

వినాయక చవితి  పండగ నాడు    దేముడి    మందిరం ముందు 
ఈ   ముగ్గు   వెయ్యండి. రెండు చుక్కలతో    మొదలుపెట్టి అటు ఇటు  చెరొక చుక్క కలుపుతూ    పన్నెండు   చుక్కలు వచ్చేదాకా  పెంచాలి. పక్కనే మరో పన్నెండు చుక్కలు పెట్టి వరసకి రెండు తగ్గించుకొంటూ  రెండు చుక్కలదాకా వెయ్యాలి.తరవాత   రంగులు వెయ్యాలి .  ముగ్గుతో    పండగని,గణపతిని ఆహ్వానించండి 

yugayugaalaki guruvu

on 1 comments Read Full Article

                                                              యుగ యుగాలకి    గురువు 

mandala

on 0 comments Read Full Article


     మండల    అనే శబ్దానికి   సంస్కృతంలో     వృత్తము అని అర్ధం .   సర్కిల్ అంటారు ఆంగ్లం లో లో .   ఆధ్యాత్మికదృష్ట్యా   మండలం    రోజులు    అంటే   నలభై రోజుల లెక్క చెపుతారు.  ఏదైనా   ఒక మంత్ర జపానికి గాని,దీక్షకి  గాని      ఈ     అంకె  ఉపయోగిస్తారు.    ఆయుర్వేద వైద్యులు కూడా     రోగికి వైద్యం చేసే టప్పుడు
ఇచ్చే మందుని     ఒక  మండలం  రోజులు     వాడి   చూడండి  తగ్గుతుంది అంటారు. ఇక గణిత శాస్త్రం  లోకి వెడితే   సున్నాకి ప్రముఖ    స్థానమే    ఉందికదా!   ఈప్రపంచాన్ని "అఖండ మండలాకారం "అని వర్ణిస్తారు.
                                   గుండ్రం గా    వేసే    ముగ్గులు చూసాము గాని,  వీటిని మండల అంటారని ,ఇది చిత్ర లేఖనలో ఒక భాగమని  తెలియలేదు.   ఈ మండల కి హిందూ ధర్మ శాస్త్రం లోను,బౌద్ధ,జైన     ధార్మిక ప్రక్రియల లోను   దీనికి ప్రముఖ స్థానం   వుందని   తెలియదు   ఈమధ్య ఏదో చదువుతుంటే    వీటిని గురించి తెలిసింది. మన శ్రీ యంత్రం    ఈ మండల   ఆకారం లోనే వుంటుంది.   శ్రీ యంత్రం వేసి    ఆరాధన చెయ్యడం   పరిపాటి.
                                        బౌద్ధులు    మండలాని చాలా అందంగా    నెల మీద చిత్రిస్తారు.  ఇసకలో రంగులు కలిపి చక్కటి  మండల ములు చిత్రిస్తారు.  రంగుల కలయిక    కొట్టొచ్చినట్లు వుంది,కళ్ళకి    విందు చేస్తుంది.  ఈకళకి కేంద్ర బిందువు    ఆధారం .  వృత్తంలో     కేంద్ర బిందువుని     ఆధారగా  పెట్టుకొని     ఎన్నో వలయాలు చిత్రిస్తూ
ఇది పూరిస్తారు.   మండల లో బౌద్ధ   మతాచార్యుల రూపాలని చిత్రిస్తారు. టిబెట్ లోని వజ్ర యాన బౌద్ధ ధర్మ శాఖలో
మందలను "  బాలూ " చిత్రాలతో    వ్యాప్తి చేసారు. తంత్ర ధ్యాన పద్ధతిలో దీనికి ముఖ్య స్థానం   వుంది.
                                           2008    మే లో దలై లామా వచ్చినపుడు    హుసే అఫ్    కామన్స్ లో  ఇసుకలో రంగులు కలిపి మండలాని  నేలమీద ఎంత ఆకర్షణీయం   గా    చిత్రిన్చారంటే    కళ్ళు తిప్పుకోలేము.
                                          వాస్తు కల లో కూడా   మండల  కి  ప్రముఖ స్థానం వుంది.   ఎన్నో దేశాలలో    చర్చిలలో   గోడలపై ,లోపల కప్పులపై    ఈ మండల చేత్రీకరణ    మనకి కనపడుతుంది.   చిత్రకలకి ముఖ్యంగా   వాడే రంగులు ఎరుపు,ఆకుపచ్చ,నీలం    పసుపు పచ్చ వీటితోమండల     చిత్రీకరణ     జరుగుతుంది. నాకు సరదా వేసి పై మండల్ని   వేసాను.     జామేట్రికల్     గా    సామగ్రి వాడి చిత్రీకరిస్తే సరిగ్గా వస్తుంది.   

sravana maasammu

on 1 comments Read Full Article

                        శ్రావణ మాసం

    'శ్రావణ మాసం  వచ్చే       చీరల్లు     చిరిగేనే
    సుదతి   నీ   పుట్టింటి    వారెలా     రారు?

  వానాకాలం వచ్చే   వలు వ ల్లు    చిరిగేనే
 వనితా నీ    పుట్టింటి   వారెలా రారు?
 ఉప్పాడ   చీరల్లు    కొని    ఏల    తేరు?"
                        అని    మా   బామ్మ   పాడుతూ వుండేది.  తెలుగు వారి ఇంట     శ్రావణ మాసానికి     ఎంత   ప్రాముఖ్యతో  చెప్పలేము.  శ్రావణ  మాసం   వస్తోందంటే      పండగలన్నీ      వెంట బెట్టుకొని    వస్తున్నట్లే!
వినాయక చవితి    దసరా, దీపావళి,   కార్తీకమాసం   నాగుల చవితి  ,అదుగో ఇదుగో అని సంక్రాంతి .కాలం ఎంత మారినా  గ్రామాలలో    మార్పులేదు.పండగ   సందడి    అంటే  పల్లెల లోనే   చూడాలి.
                              మట్టి    ఇళ్ళల్లో వుంటే     ముందుగా      గోడలు    బాగుచేసుకోవాలి.  పెళ్ళలు     ఊడిపోయిన చోట    నాము సుద్ద  గట్టిగా కలిపి     వాటిని     పూడ్చాలి.  అవి ఆరాక    సున్నమో,సుద్దో కలిపి గోడలకి  వెల్ల వెయ్యాలి.  పప్పులు తెప్పించి   బాగుచేసి పెట్టుకోవాలి.    శ్రావణ  మాసం వచ్చిందంటే     క్షణం      తీరిక   వుండదు.
కొత్తపెళ్లి కూతురు  వుంటే     మంగళ గౌరీ    నోము    నోయించడం,  వియ్యాల  వారు   శ్రావణ   పట్టీ  తేవడం ,వారికి విందులు,మర్యాదలు.  నాలుగు మంగళ వారాలు పూజ.   పౌర్ణమి    ముందు   వచ్చే శుక్రవారం     వరలక్ష్మీ  వ్రతం ,తెలుగింటి     ఆడపడుచులందరూ      తప్పక చేసుకొనే పూజ.   లక్ష్మీ కటాక్షం   ఉంటేనే    సంసార శకటం    సాఫీగా
నడుస్తుంది.   లక్ష్మి   అంటే  డబ్బే  కాదు,  మాట వినే సంతానం, వినయంగా   సేవ చేసే      నౌకర్లు, సమృద్ధిగా   పాలు,పెరుగు ,    ఆరోగ్యం,  మనశ్శాంతి    ఇవన్నీ  లక్ష్మీ కటా క్షాలే!    వీటన్నిటినీ    ఇయ్యమని    ఇల్లాలు లక్ష్మిని
మనసారా కొలుస్తుంది.   కొత్త చీరలు కొనుక్కొన్నా ,ఎవరేనా పెట్టినా    శ్రావణ     మాసం     వచ్చేదాకా   గడి విప్పరు
వనితలు.  నాలుగు మంగళ వారాలకి   పేరంటానికి కొత్త చీర   కట్టుకు   వెళ్ళాలి,శుక్రవారం     తప్పక   కొత్త చీర కట్టుకోవాలి.
                              శ్రావణ   మాసం వచ్చేసరికి ఇల్లు వాకిళ్ళు    కడిగి ,ముగ్గులు పెట్టి , గడపలకి   పసుపు కుంకాలు  దిద్ది    ,మామిడి    తోరణా లతో     గుమ్మాలు అలంకరించి    శ్రావణ    లక్ష్మికి    స్వాగతం  పలుకుతారు.
శ్రావణ    మాసానికి మరో విశేషం      వానలు.  పేరంటాళ్ళు     వాన చినుకుల్లో     తడుస్తూ     మధ్య మధ్య    ఎ చూరు కిందో     క్షణం    నిలబడి మరో ఇంటికి    పేరంటానికి పరుగెత్తడం.  ఈ శ్రావణ  మాసం రాగానే  అందరికి    '
తమ తమ     అనుభవాలు      జ్ఞాపకానికోస్తాయి.
                                       నేను ఒక సంవత్సరం     మోదేకుర్రులో     నోములు నోచుకోన్నాను.  మాతాతమ్మ   నోయించింది.అప్పుడు ఇంట్లో గడియారాలు లేవు.   తాతమ్మ ఖంగారులో   ఎప్పుడో నిద్ర లేచి   పూజకి అన్ని సిద్ధం చేసి నన్ను లేపేది.   నేను పూజ చేసుకొనే సరికి ఇంకా దాసీది  వచ్చేదికాదు. పల్లెటూళ్ళల్లో అయిదు గంటలకల్లా  వచ్చేస్తారు. నేను పిల్లాన్ని ఒళ్లో     వేసుకొని      ఉయ్యాలా   బల్ల మీద    ఒక నిద్రతీసే దాన్ని, అప్పుడు తూరుపు రేకలారేవి,దాసీది వచ్చేది.శనగలన్నీ    ఒక బుట్టలోవేసి,బియ్యపు పిండి,బెల్లం వేసి చేసిన   ఉండ్రాళ్ళు   తాంబూలం శనగల  మీద   పెట్టి    అమ్మవారికి ముందు వాయనం   ఇప్పించేది తాతమ్మ.  ఆ తరవాతనే కాఫీ  తాగడం.  ఒఅకరికి ముందు    వాయనం    ఇచ్చిరంమని పంపెదినన్ను.  వాళ్ళింటికి    వెళ్ళే సరికి వా ళ్ళు    తయారుగా  వున్దేవారుకాదు.  నన్ను కాసేపు   కూర్చోపెట్టి వాయనం   తీసుకొనే  వారు.
                         తాతమ్మ ఇల్లు    మండువా   ఇల్లు.   సూర్యుని ఎండా మండువా దాటి వంటింటి     గడప తాకిందంటే   చాలా పొద్దెక్కి నట్లు    తాతమ్మ లెఖ్ఖ .అప్పుడు భోజనాలయిపోవాలి.   వాటిల్లంతా శుభ్రం  చేసేసుకొని,
రాత్రిళ్ళు తాగేందుకు    తాతమ్మ  మంచం   కింద   మరచెంబుతో    మంచినీల్లుపెట్టి  పక్క సవరించేయ్యాలి.   అప్పటికి  పది అయ్యేదేమో!  మల్లి తాతమ్మ   నన్ను తొందరపెట్టేది.  నిన్ను   పేరంటానికి పిలచిన   వాళ్ళింటికి   వెళ్లి
త్వరగా   వాయనం    పుచ్చుకురా!   మల్లి మన ఇంట్లో పేరంటానికి వస్తారు.అనేది.  నేను వెళ్లేసరికి వాళ్ళ పూజలు అఎవికావు.  వాళ్ళ,అత్తలో,అమ్మలో    ఆపిల్లల్ల్ని   చివాట్లు వేసేవారు."చూడు  బాలమ్మత్త   మనవరాలు,పూజా అంతా  చేసుకొని  పేరంటానికి     వచ్చింది.   మీరింకా   ఓనమ అనలేదు,జడ్డి మొహాలు"అని.బొట్టుపెట్టించుకొని వెనక్కి వచ్చేదాన్ని.  ఆ పిల్లలు సాయంత్రం పేరంటానికి వచ్చినపుడు"  ఏమే !నువ్వంత తొందరగా రాకే !  చివాట్లు పడుతున్నాయి"అని బతిమాలేవారు.
                        ఇంటికి రాగానే       తాతమ్మ       హాలులో చాపలు పరిచి,గంధం తీసి పెట్టమనేది. మూడు అయేసరికి పేరంటాళ్ళు రావడం ప్రారంభించేవారు.  కొత్తపేట నుంచి     ముత్తైదువ లందరూ    ఒకేసారి వచ్చేవారు.
ఎదుగాజాల చీరలు కచ్చాపోసి కట్టుకొని     ,నుదుట సూర్య బింబం అంట బొట్టు పెట్టుకొని ,కొప్పులో    పూలు పెట్టుకొని  ,కాళ్ళకి పసుపు తాసుకొని మె డలో నల్లపూసలతో    వచ్చేవారు.అందరు   దేవతా స్వరూపుల్లా  వుండేవారు. తాతమ్మ నాచేత  వాళ్ళందరికీ పారాణి ప్పెట్టించేది.  వారికి గంధం రాస్తే,  వాళ్ళు నాకు రాసేవాళ్ళు,ఏవేవో    దీవన లిచ్చేవారు, అట్ల  కాడకి    పట్టిన    నోము కాటుక ఇస్తే   కళ్లకి   పెట్టుకొని    ఆచేయి తలకి రాసుకొని   నావంక ముసిముసిగా నవ్వుతూ చూసేవారు.  ఆకాటుక పెట్టుకొంటే    జన్మ చరితార్ధ మయి నట్లే   భావించేవారు.కళ్ళ ముందు    ఈనాటికి    ఆ  పేరంటాళ్ళు    కన్పిస్తారు.

                  ఈ    జెట్    యుగం లో     శ్రావణ్ మాసం   ఎటు వస్తోందో ఎటు పోతోందో     తెలియడం   కష్టం గావుంది. విదేశాలలో వుంటే చెప్పక్కర్లా!ఏమిటో ఆలో చిస్తూ కూర్చున్నాను.   ఇంతలో ఫోన్ మోగింది.  మంగళ
వారం    పేరంటానికి రండి అని    మా కోడల్ని పిలుస్తున్నారు.   "తప్పకున్దావస్తా!అటు నాకు కొంచెం పని కూడా వుంది,మా  అత్తగార్ని కడా తీసుకు వస్తా."అని చెప్పింది. "పసుపు,కుంకుమకి    పదిమైళ్ళ దూరమైనా    వెళ్ళాలి "అని అనే వారు.  ఇప్పుడు అలా వెళ్ళే   తీరిక లేదు. నోచుకొన్న వాళ్ళే    పసుపుకుంకుమలు,పళ్ళు,వాయనం,కాటుక తీసుకు ఇంటికి వెళ్లి ఇచ్చి వస్తున్నారు. మేము వెళ్ళిన అమ్మాయికి ఒక పాప కూడా  వునిది .కొందరి ఇంట ఆనవాయితీలో ముత్తైదువలు    ప్రతిఏటా    పెరుగుతారు.తోరానికి వేసేముల్లు,దీపాలు ఏడాదికి  అయిదు చొప్పున పెరుగుతాయి.  ఈంమయికి అలానే పదిహేను మందికి వాయన మ ఇచ్చుకోవాలి.  పిల్లని తీసుకెళ్ళాలి. తెలుగువాళ్ళు అనితెలుస్తే చాలు వాళ్ళ అడ్రెస్ ,ఇంటి నంబరు    తెలుసుకొని  వాళ్లకి ఫోన్ చేసి రమ్మంటే వెళ్లి వాయనం ఇచ్చి రావాలి.  అలా  వెళ్ళిన పుడు వాళ్ళ పక్కిన్తివాల్లకి ఫోన్ చేసి మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు,వాయనం తీసుకోండి అనిఫోనే చేసి సహాయం చేసారు.  శ్రద్ధగా   అందరికి వాయనాలు ఇచ్చుకొన్దిఆ అమ్మాయి.  వ్రతాలకి విశ్వాసమే   ముఖ్యం.  సంఘీభావం కూడా   పెరుగుతుంది. మొత్తానికి ఇవాళ శ్రావణ లక్ష్మి    గలగలలు    వినిపించాయి.  

                                            

sudarsana sthuti taatparyam

on 0 comments Read Full Article

                              సుదర్శన స్తుతి        తాత్పర్యం
       
                   నీవు అగ్ని భగవానుడవు,నీవు సూర్యుడవు ,నీవు నక్షత్రా ధీశుడగు  సోముడవు,నీవు జల రూపుడవు,నీవు   భూమివి   ,నీవు  ఆకాశ మవు,నీవు వాయువు నీవు పంచ భూతములు;వాని గుణములు నీవే!నీవు ఇంద్రియములు,సహస్రార చక్రంలో నాశనం లేని పరమాత్మకు ప్రియుడవు,నీవు సుదర్శ నుడవు,నీకు నమస్కారం.నీవు సర్వాస్త్ర ములను  నాశనం చేస్తావు.ఈ    బ్రాహ్మణుని రక్షించు.నీవు సర్వ భూమిని పాలించుతావు..నీవు ధర్మము.నీవు అమృతము,నీవు సత్యము.యజ్ఞము నీవు.యజ్న భోక్తవు నీవు,లోకపాలుడవు.సర్వాత్మవు.నీవు పరమ పురుషుని తెజస్సువు.నీవు సునాభుడవు.సకల ధర్మములకు సేతువు.అధర్మ శీలురైన   అసురులకు నాశాకుడవు.  మూడు కొలాలను రక్షించుడువు.విశుద్ధ కాంతివి.నీవు మనో వేగము కల వానివి. అద్భుత కర్మ గలవాడవు. ఇట్టి నీకు నమస్కరిస్తున్నాను.ధర్మ మైన   నీ  తేజస్సుచే ,తమస్సు అణిగి పోతుంది.మహాత్ములకు నీవల్ల ప్రకాశం కలుగుతుంది.బ్రహ్మ దేవుడు కూడా నీ  మహిమలు  అతిక్ర మించ లేడు.మంచి చెడ్డల  ఆవరణం యావత్తూ నీ  రూపమే!  నిరంజనుడగు వాని చేత  నీవు  ఉపయోగింప బడి నప్పుడు వానికి  బలము,ప్రతిష్ట,  రాక్షస విజయము సిద్ధిస్తుంది.యుద్ధంలో నీవు శత్రువుల   బాహువులను  ,పోత్తలను,తొడలను,పాదాలను,తలలను నరికి వేస్తావు.జగత్తును రక్షించడానికి ,దుష్టులను శిక్షించడానికి నీవు సమర్దుదవని భగవంతునిచే నిర్ణయింప బడి యున్నావు.మా కుల దేవత రక్షించి నట్లు ఈ విప్రుని రక్షింపుము.నేను సమర్పించినాను,నీకు ప్రియమైన దేదైనా నున్నచో ఈ ద్విజుడు   బాధా  రహితు దాగు  గాక!సర్వ గుణా శ్రయుడై అద్వితీయుడైన   పరమాత్మ సర్వ   భూతాత్మ భావన చేత నాయందు సంతుష్టి పొంది యున్నచో తప్పక   ఈద్విజుడు బాధా రహితు డగు  గాక!
                                     మామూలుగా    ఆయుధాన్ని వేడుకోవడం అనేది వుండదు.ఆయుధానికి ఆ  ప్రార్ధనను వినే శక్తి   వుండదు  గదా! అచేతన మైన   ఆయుధాన్ని వేడుకోవడ   మేమిటి?దీనిని పట్టి అది   ఆయుధం   కాదని ,అది సాధకుదిలోనే వున్నా జ్ఞాన  దృక్పధం  అని   మనం గ్రహించాలి. ఆజ్ఞాన  దృక్పధాన్ని పెంచుకొన  దానికి చేసే సాధనలలో   ఈ సుదరణ స్తుతి సాధన ఒకటిగా     భావించాలి. ఈ విధంగా   సాధకుడు    తనలో  నున్న సుదర్శ నాన్ని తానూ గుర్తించడమే ఈ సుదర్శన  స్థితిలోని   ఆన్తర్యంగా   భావించాలి. కనుకనే ఈ స్థితి అంటే జ్ఞాన  పధం గానున్నదని     గ్రహించాలి. 

sudarsana sthuti

on 0 comments Read Full Article

                                          సుదర్శన స్తుతి

               సాధకునిలో కల్గిన జ్ఞాన పరిణితి వల్లనే అతడు తనలోనే వున్నా మాయను తొలగించుకోడానికి తానూ జ్ఞాన దృష్టి యోక్కసంపూర్నావిర్భావాన్ని తనలో నిమ్పుకొంటాడు.అప్పుడు  ఆ  మాయా  జ్ఞానం లో పూర్ణంగా విలీన మై పోతుంది.అదే అంబరీషుడు సుదర్సనాన్ని    స్తుతించడం దుర్వాసుడు   రక్షించ బడటం అన్నదాని యొక్క   అంతరార్ధం.తర్వాత సాధకుడు   జ్ఞాన  దృష్టితో చిరకాలం శాంతిగా జీవించి కైవల్యం పొందదమన్నదేంబరీషుడు అరణ్యంలో తపస్సు చేసి ముక్తి సాధించేదన్న దానికి   అంతరార్ధం.అరణ్యం అంటే న+రణ్యం =అరణ్యమవుతుంది.రణ్యం అంటే ధ్వని చేసేది అని   అర్ధం. అరణ్యం అంటే ధ్వని లేనిదిఅనగా  ప్రశాంతి అని అర్ధం .ఇక్కడ   వ్యాసుడు అమ్రీషుని చేత చేయించిన సుదర్శన స్తుతి సాధకులకు  ఏంటో  ఉపయోగ కరమైనది.అందులో ఎక్కడా  సుదర్శనం కేవలం ఆయుధం గానూ ,అన్ని  ఆయుదాల్లాంటి ఆయుధంగాచేప్పబడ నే   లేదు. సు=చక్కని,దర్సనం =దృష్టి అనగా జ్ఞానాన్ని అనే అర్ధాన్ని ఇచ్చేది అనే అర్ధం గలదిగా ఆ స్తోత్ర వుంది.దాన్ని పట్హితలకు ఉప  యోగార్ధం  ఇందు తాత్పర్య సహితం గా  ఉదాహరిస్తున్నాను.

శ్లోకం  త్వ మగ్నిర్భాగావాన్  సూర్య:
         త్వం సోమో జ్యోతిషాం   పతి;
        త్వమాపస్త్వం క్షతిర్వ్యోమ
        వాయుర్మా తేన్ద్రి యాణిచ

        సుదర్శన:     నమస్తుభ్యం
        సహస్రారాచ్యుత   ప్రియ:
        సర్వాస్త్ర     ఘాతిన్    విప్రాయ
        స్వస్తి భూయా దిడ శ్రుతే!

        త్వం దర్మస్త్వ మమృతం సత్యం
        త్వం యజ్ఞో  ఖిల్ యజ్న భూక్
         త్వం లోక పాల సర్వాత్మా
        త్వం తేజ్: పౌరుషం  పరం

         నమస్సునా భాఖిల ధర్మ సేతవే
         హ్యధర్మ శీ లా సుర ధూమ కేతవే
         త్రై లోక్య  గోపాయ విశుద్ధ  వర్చసే
        మనోజవా యాద్భుత   కర్మ ణే  గృ ణే


        త్వత్తేజసా     ధర్మ మయేన    సంహితం 
        తమ; ప్రకా శశ్చ  ధృతో    మహాత్మనాం
        దురత్య యస్తే మహిమా  గిరాం పతే:
        త్వద్రూపమే తత్ సదసత్   పరాపరం

       యదా విన్రు  ష్ట్వంత్వు    మనం జనే    నవై
       బలం ప్రవిష్టో    జత దైత్య     దానవం
      బాహూ దరోర్వంఘ్రి    శిరో    ధరాణి
      వృశ్చ్చ న్నజసంప్రదనే విరాజసే


       సత్యం జగ త్రాణ   ఖల  ప్రహా ణ యే
       నిరూపిత సర్వ సహో గదా భ్రుతా 
       విప్రస్య చాన్నత్కుల  దేవతేన
       విదేహి భద్రం తదను గ్రాహిన:

        యద్యస్తి దత్త మిష్టం వా
        స్వధర్మో వాసవ  సష్టి త:
      
        కులం మోవి ప్రడైవం చేత్
        ద్విజో భవతు    విజ్వర :

         యదిమో భగవాన్ ప్రీత:
        ఎకస్సర్వ  గుణా శ్రయ
     
         సర్వ భూతాత్మ   భావేన
         ద్విజో భవతు   విజ్వర:

              {దీనిని డాక్టర్    వేదుల సూర్య నారాయణ శర్మ   గారిచే రచింపబడిన    "అంతరార్ధ  భాగవతము నుండి తీసుకోన బడినది.  ధన్య వాదములు , ఇది ప్రకటించుటకు అభ్యంతరమున్నచో తెలుపగలరు.రేపు దీని తాత్పర్యము  తెలుసుకొందాము,]     జ్ఞాన ప్రసూన.

       
          

shubhaakaankshalu

on 0 comments Read Full Article

                                     శుభాకాంక్షలు
                         నందన నామ   సంవత్సరంలో    ఆనంద నందనుడు    మీకందరికీ తోడై, నీడై
    వీడని వెలుగై ,నడవడికలు దిద్ది ,మదిలో నవ్వులు నింపి ,  తనువున శౌర్యం    కూర్చి
     జాలి,దయలను   సఖులను చేసి , సంస్కృతీ,సంప్రదాయాల  రక్షణకు    కంకణం కట్టి,
   దైవ భక్తిని    ఊతగా చేసి     శాంతిగా    జీవితం     గడిపించాలని కోరుతూ
  జ్ఞాన ప్రసూన

aandaal ammavaaru

on 0 comments Read Full Article

aa
ఆండాళ్   అమ్మవారు                                                                                       జ్ఞాన ప్రసూన