దైవం

on 2 comments Read Full Article

                                                                         దైవం


      నాకేమి చింత  నారాయణుడుండ 
   నా కేమి బాధ  నారాయణుడుండ 
   నా  మంచి ,చెడ్డలు  చూసేటి  వాడు 
   నా ముందు నడిచి   నడిపేటి వాడు 

    నాపాలి దైవం, నేకొలిచే దైవం 
    నా గుండె గుడిలోన   వెలిగేటి దీపం 
     నామ స్మరణ విని ,నవ్వేటి  దైవం 
      నామాలు ధరియించి నిలచిన దైవం 
   
     నావాడవని తలచి నీ జాడ తెలియక 
     నోచిన నోములకు ఫలమిచ్చు దైవం 
      నమ్మిన వారిని పొమ్మనక కాచి,
     నమ్మనివారిని దరికి రమ్మనే దైవం 

     నాలుగు యుగముల నవరూపములు   దాల్చి 
    నరుల బ్రోచి ,అసురుల దునిమిన దైవం 
     నరకము, నాకము నీచేతిలొనని !
      నచ్చ చెప్పి ,హెచ్చరిక చేసే   దైవం 

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

on 1 comments Read Full Article

       శ్రీ రామ నవమి    శుభాకాంక్షలు 
                అలనాడు    శ్రీ రాములు    అవతార పురుషులు   దుష్ట శిక్షణ చేసారు.  శ్రీ కృష్ణుడు   చాక చక్యంతో    ఎంతోమంది    దుష్టులను  సంహరించాడు . వారికి   దుష్టులెవరో     ద్రష్టి గోచరమయారు . శ్రీ  హనుమ కూడా     రామనామ మహిమతో,   నామ జపంతో   అమిత మైన బలం సంపాదించి   రాక్షస   సంహారం   చేసాడు . ఈనాడు   రాక్షస   రూపం లెకుండా ,రాక్షస   ప్రవృత్తులు   మనసు నిండా  కుక్కుకొని  జన్మి స్తున్నారు. వీరి లోని   రాక్షస గుణాలు స,అణిచి వెయ్యమని  ,పెకలించి పారవెయ్యమని ,శాంతిని   నెలకొల్ప మని   అవతార పురుషులని   ప్రార్ధిస్తున్నాను .