mandala
మండల అనే శబ్దానికి సంస్కృతంలో వృత్తము అని అర్ధం . సర్కిల్ అంటారు ఆంగ్లం లో లో . ఆధ్యాత్మికదృష్ట్యా మండలం రోజులు అంటే నలభై రోజుల లెక్క చెపుతారు. ఏదైనా ఒక మంత్ర జపానికి గాని,దీక్షకి గాని ఈ అంకె ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యులు కూడా రోగికి వైద్యం చేసే టప్పుడు
ఇచ్చే మందుని ఒక మండలం రోజులు వాడి చూడండి తగ్గుతుంది అంటారు. ఇక గణిత శాస్త్రం లోకి వెడితే సున్నాకి ప్రముఖ స్థానమే ఉందికదా! ఈప్రపంచాన్ని "అఖండ మండలాకారం "అని వర్ణిస్తారు.
గుండ్రం గా వేసే ముగ్గులు చూసాము గాని, వీటిని మండల అంటారని ,ఇది చిత్ర లేఖనలో ఒక భాగమని తెలియలేదు. ఈ మండల కి హిందూ ధర్మ శాస్త్రం లోను,బౌద్ధ,జైన ధార్మిక ప్రక్రియల లోను దీనికి ప్రముఖ స్థానం వుందని తెలియదు ఈమధ్య ఏదో చదువుతుంటే వీటిని గురించి తెలిసింది. మన శ్రీ యంత్రం ఈ మండల ఆకారం లోనే వుంటుంది. శ్రీ యంత్రం వేసి ఆరాధన చెయ్యడం పరిపాటి.
బౌద్ధులు మండలాని చాలా అందంగా నెల మీద చిత్రిస్తారు. ఇసకలో రంగులు కలిపి చక్కటి మండల ములు చిత్రిస్తారు. రంగుల కలయిక కొట్టొచ్చినట్లు వుంది,కళ్ళకి విందు చేస్తుంది. ఈకళకి కేంద్ర బిందువు ఆధారం . వృత్తంలో కేంద్ర బిందువుని ఆధారగా పెట్టుకొని ఎన్నో వలయాలు చిత్రిస్తూ
ఇది పూరిస్తారు. మండల లో బౌద్ధ మతాచార్యుల రూపాలని చిత్రిస్తారు. టిబెట్ లోని వజ్ర యాన బౌద్ధ ధర్మ శాఖలో
మందలను " బాలూ " చిత్రాలతో వ్యాప్తి చేసారు. తంత్ర ధ్యాన పద్ధతిలో దీనికి ముఖ్య స్థానం వుంది.
2008 మే లో దలై లామా వచ్చినపుడు హుసే అఫ్ కామన్స్ లో ఇసుకలో రంగులు కలిపి మండలాని నేలమీద ఎంత ఆకర్షణీయం గా చిత్రిన్చారంటే కళ్ళు తిప్పుకోలేము.
వాస్తు కల లో కూడా మండల కి ప్రముఖ స్థానం వుంది. ఎన్నో దేశాలలో చర్చిలలో గోడలపై ,లోపల కప్పులపై ఈ మండల చేత్రీకరణ మనకి కనపడుతుంది. చిత్రకలకి ముఖ్యంగా వాడే రంగులు ఎరుపు,ఆకుపచ్చ,నీలం పసుపు పచ్చ వీటితోమండల చిత్రీకరణ జరుగుతుంది. నాకు సరదా వేసి పై మండల్ని వేసాను. జామేట్రికల్ గా సామగ్రి వాడి చిత్రీకరిస్తే సరిగ్గా వస్తుంది.