దైవం
దైవం
నాకేమి చింత నారాయణుడుండ
నా కేమి బాధ నారాయణుడుండ
నా మంచి ,చెడ్డలు చూసేటి వాడు
నా ముందు నడిచి నడిపేటి వాడు
నాపాలి దైవం, నేకొలిచే దైవం
నా గుండె గుడిలోన వెలిగేటి దీపం
నామ స్మరణ విని ,నవ్వేటి దైవం
నామాలు ధరియించి నిలచిన దైవం
నావాడవని తలచి నీ జాడ తెలియక
నోచిన నోములకు ఫలమిచ్చు దైవం
నమ్మిన వారిని పొమ్మనక కాచి,
నమ్మనివారిని దరికి రమ్మనే దైవం
నాలుగు యుగముల నవరూపములు దాల్చి
నరుల బ్రోచి ,అసురుల దునిమిన దైవం
నరకము, నాకము నీచేతిలొనని !
నచ్చ చెప్పి ,హెచ్చరిక చేసే దైవం
నాకేమి చింత నారాయణుడుండ
నా కేమి బాధ నారాయణుడుండ
నా మంచి ,చెడ్డలు చూసేటి వాడు
నా ముందు నడిచి నడిపేటి వాడు
నాపాలి దైవం, నేకొలిచే దైవం
నా గుండె గుడిలోన వెలిగేటి దీపం
నామ స్మరణ విని ,నవ్వేటి దైవం
నామాలు ధరియించి నిలచిన దైవం
నావాడవని తలచి నీ జాడ తెలియక
నోచిన నోములకు ఫలమిచ్చు దైవం
నమ్మిన వారిని పొమ్మనక కాచి,
నమ్మనివారిని దరికి రమ్మనే దైవం
నాలుగు యుగముల నవరూపములు దాల్చి
నరుల బ్రోచి ,అసురుల దునిమిన దైవం
నరకము, నాకము నీచేతిలొనని !
నచ్చ చెప్పి ,హెచ్చరిక చేసే దైవం