శ్రవణ మహిమ

on

శ్రవణ మహిమ
పరమార్ధమునకు ముఖ్య సమాధాన కారణమగు సాధనము శ్రవణము.
శ్రవణము వలన భక్తి లభించును .విరక్తి ఉత్పన్నమగును. విషయాసక్తి తగ్గి పొవును.
శ్రవణము వలన చిత్తశుధ్ధి కలుగును. బుధ్ధి ధ్రుఢ మగును. అభిమానో పాధి
తొలంగును. శ్రవణము వలన నిశ్చయము కలుగును. మమత్వము తెగిపొవును. అంత:కరణము
నందు సమాధానము జనించును. శ్రవణము వలన సందేహములు విడిపొవును. శంక లంతరించును. సద్గుణములు కలుగును. శ్రవణము వలన మనో నిగ్రహము సిధ్ధించును.
సమాధానము చేకూరును. దేహబుధ్ధి తో కూడిన బంధనములు తొలంగును. "నేను"
అను భావము దూరమగును. సందేహము దరికిరాదు. బహువిధ విఘ్నములు పటాపంచలగును.
కార్య సిధ్ధి యగును. సమాధి ఏర్పడును. మరియు పూర్ణమగు పరమ శాంతి లభించును.
సాధు సమాగమము కావించి అధ్యాత్మ శ్రవణ మొనరించుటచె వ్రుత్తి దానియందు లీనమగును. శ్రవణము వలన ప్రబొధము వ్రుధ్ధి యగును. ప్రజ్ఞ ప్రబలమగును.విషయ
పాశములు తెగిపోవును.వివేకము వచ్చును. జ్ఞానము వ్రుధ్ధినొంది బలము సమకూరును.
దాని వలన సాధకునకు వస్తు జ్ఞానము కలుగును. దుస్సాంగత్యము విడిపోవును.కామ వాసనలు క్షీణించును. ధైర్యము ప్రకాశించును. నిశ్చయాత్మకమగు సద్వస్తువు భాసమగును. శ్రవణము వలన సద్బుధ్ధి కలుగును. వివేక మతిశయించును.మనస్సు భగవంతునుయందు నాటుకొనును. మొహము నశించును. భవ భయము నాశనమగును.
ఉత్తమ గతి కలుగును. శాంతి లభించును. నివృత్తియు,అచల పదమును ప్రాప్త మగును.శ్రవణ మునకు సమాన మగు సాధన మెద్దియును లేదు.దానివలన అన్నియును సమకూరును.భవ నది తరించుటకు శ్రవణము నౌక సుమా![daasa bodha nunchi]

0 comments:

Post a Comment