యాగంటి

on

జగదాంబ సర్వాలంకార భూషితురాలయి అంతరంగిక మందిరాగణ భూమిరజతాచల శృంగాగ్ర మధ్యప్రదేశం లొ,చలువరాతి భవంతిలొ నిత్యపూజలందుకొని "ఎవరక్కడ?"అంది.శృంగీ ,భృంగి వచ్చారు."నందీశ్వరుణ్ణి పంపండి"అంది.దండి దొర నందీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు."భరత ఖండం లొ మహావీర విజయరామ భూపాల వర్మ ఏలుబడి లొని ఎర్రమల ప్రాంతంలొ ప్రశాంతంగా,ప్రమోదంగా,ప్రశస్థంగా వుండేస్థలం కావాలి."అంది.నంది విస్తు పోయాడు."మనం అక్కడ "ఉమామహేశ్వరులవలె "పీఠం వెయ్యాలి" అంది.చిత్తం అంటూ నిష్క్రమించాడు నంది. చంద్రకాంత శిలపై యోగనిష్ట లొ వున్నాడు శివుడు.గంగాజల మణి కుంభాభి షేకం ,బిల్వార్చన,కుసుమార్చన,గంధాలంకరణ జరిగింది."ఓం నమశ్శివాయ,జగదీశ్వరాయ, సర్వేశ్వరాయ,విశ్వేశ్వరాయ,శశి శేఖరాయ,గంగాధరాయ,కందర్పహారాయ,పినాకహస్తాయ,ఉమావల్లభాయ,మహేశ్వరాయ నమోనమ: అంటూ నంది వచ్చి పాదాభివందనం చేసాడు. అరకన్ను విప్పి త్రినేత్రుడు "నందీ! ఉమ ఆజ్ఞాపించినదికదా !భక్త శిఖామణి విజయరామ భూపాలుని ముచ్చట చెల్లించడానికి మనమా ప్రాంతంలొ తిష్ట వేయకతప్పదు"అన్నాడు అపర్ణా ప్రియుడు.నంది శెలవు తీసుకొన్నాడు. * * * * * * కొసదేరిన పాటికొమ్ములు ,జింకబొడ్డు, ఎగుమలుగులు పెరిగి వాలిన చెండు,ముద్దగిట్టలు,సన్నని నాగుబామువంటి నాజూకైన తోక,మురిపెంగా ముడతపడిన గంగడోలు,మృదువయిన శరీరం ,కాటుక కళ్ళ మైల కోడె కాలుదువ్వి,రంకె వేసివనంలొ కుప్పించిదుముకుతున్నది.పులులు భయపడుతున్నాయి,పొలాలు పాడవుతున్నాయి ,గండరగండదనిపించుకొన్న కోయ దొరలు పిల్లుల్లా పొదలమాటున దాక్కున్నారు.వనసుందరి హడలిపోతున్నది. నాడు కార్తీక శుక్ల ఏకాదశి ,సోమవారం,జయలగ్నం .పండువెన్నెల వెండితీగల జలతారు తెరలు కొండగాలికి కదులుతున్నాయి.కోడె మేను పులకరించింది. కంటిని, కంటి, కంటి, కలయా ఉహూ కమ్మ్మని కొండ కోనయే గంటిని అమ్మవారికి సుఖమ్మున పీఠము వేయనైనదే గంటి,పవిత్రమైనది జగధ్ధిత కీర్తి గడించుగాక,ము క్కంటి వరాల స్వామి జనకక్ష్యకు వచ్చి పచారు సేయుతన్ అన్న వాక్కులు ఆకోడె నోటి గుండా బయలు వెడలి వనమంతా మారుమ్రోగాయి. "తథాస్తు!నందీశ్వరా !తథాస్తు,సత్యవాణి సరస్వతి నీనోటిగుండా వెలువడిన "యాగంటి,ఏగంటి"అన్న పదప్రయోగమే ఈపవిత్ర క్షేత్రానికి నామకరణ మగుగాక! అన్నది. కోడె ఏప్రాణికి అపకారం జరగకుండా ఆర్భాటం చెస్తున్నది.
విజయ రామ భూపాల వర్మ సింహాసనాధిష్టుడైనాడు.ఆస్థాన నర్తకి రాయంచలా మయూరిలా వచ్చి అంజలి ఘటించింది."ఊ పరమ శివుడు అంత రంగానికి ప్రత్యక్షం కావాలి! ప్రారంభించు"అని అజ్ఞాపించాడు ప్రభువు. జయజయ జయజయఇందుశేఖరా! నందివాహనా వందనం అభివందనంఫాల లోచనా!పన్నగభూషణా!పార్వతి వల్లభావందనం అభివందనం పినాకపాణీ!త్రిశూల ధారీ! జగద్రక్షకా!జటాప్రదీపా! వందనం అభివందనంగజచర్మాంబర ,నట గంగాధర భక్త వశంకర ,బోళాశంకర భవనాశంకర నీల కంధరాత్రిభువన సుందరావందనం అభి వందనం జయ జయ జయ జయ శంకరా అభయంకరా! జటలు సడలగా డమరు నదరగా కురంగ మెగురగా గంగదూకగా ఫణులు జారగా శూలమాడగా శశి తూగాడగ దిక్కులు కంపిల భూమి ఆకశం ప్రకంపించగా ఫాల లోచనం భగ్గు భగ్గు మని ప్రజ్వరిల్లగా ధిం ధిం ధిం ధిం ధిం తాండవార్భటిని దూకులాడగా కపాలమాలీ విభూతి భాసా వందనం అభివందనం జయ జయ జయ జయ త్రిపుర సంహారా త్రిలోక పూజ్యా! భవాశివ శంకరా! వందనం అభి వందనం నమో నమోనమో ఇంతలో ప్రజలు వచ్చి కోడెదూడ ఆగడాలు ప్రభువుకు విన్న వించారు.:ప్రజలారా!భయపడకండి.మెము మీ సుఖ్స్ శాంతుల కొసమే కొలువున్నాము.,అని పీఠం దిగీడుగు ముందుకు వేసాడు.పరివారంతోసహా రాజు అడవికి వెళ్ళి,కోడెదూడ వున్న ప్రాంతంతంలొకి వెళ్ళి,పరివారాన్ని అక్కడే వదిలి ఒక్కడె కోడె నెదుర్కొన్నాడు.కోడెకొమ్ముల తాకిడికి రాజు చేతులు చిట్లి రక్తం చిమ్మాయి.అఖండ శౌర్యం తో కోడెరామ భూపాల వర్మ మహారాజును రెండుకొమ్ములతో చెండి గగనానికి ఎగరేసింది."ఉమా మహేశ్వరా!శరణు శరణు అని రాజు వేడుకొన్నాడు.ప్రజలు,పరివారము పరుగెత్తుకు వచ్చి ఈ దృశ్యం చూసి హాహా కారాలు చేసారు.ఓంకారం హూంకరించింది.అంతా కళ్ళు తెరచి విభ్రాంతులయినారు.చదును ప్రదేశంలొ సుమారు ముప్పదియారంగుళాల పొడవు,పదునారంగుళాల వెడల్పు,పదంగుళాల దళసరి గల ఒక సుందర నీల శిలాఫలకంజేగీయ మానంగావిరాజిల్లు తూంది.ఆశిలలో ఉమా మహేశ్వర స్వరూపం స్పష్టంగా గోచరిస్తోంది.ఆ విగ్రహం ముందు నిలబడి,చేతులు పైకెత్తి ఒంటికాలిపైనిలుచున్న రాజు కంపించాడు.శివుని స్తోత్రం చేస్తున్నాడాయన.ప్రభువు దర్శనంతో ప్రజల సంతో షం కట్టలు తెంచుకొని వెల్లువ వలె పొంగింది.అప్పుడు గుర్తువచ్చింది కోడెస్వంభూ నీలశిల విగ్రహానికిసుమారు అరువది గజాల దూరంలోఇంచుమించు పండ్రెండు అడుగుల పొడవు,ఆరడుగుల వెడల్పు,నాలుగడుగుల ఎత్తుకల భ్రహ్మాండమైన ఏక శిలా నంది ప్రశాంతం గా పదుకొని వుంది.:రామ భూపాలా!నిన్ను నీప్రజలను తరింప చేయడానికి,నీచిరకాల వాంచ తీర్చడానికి నేను ఉమా ఇక్కడ ఆవిర్భవించాము.నీకొండకోనల్లో ఆగం చేసిన ఆకోడె ఎవరో కాదు సాఖాత్తు నందీశ్వరుడు."అన్నాదు శివుడు.ఇకనుంచి ఏక్షేత్రం ఏగంతి,యాగంటి గాప్రసిధ్ధి చెందుతుంది.రాజు వినయంగా తలవంచి నమస్కరించాడు."విజయరామ భూపాలా!నీబల పరాక్రమాలకు పులకరించి నేనూ ఇక్కాడే వుండిపొతున్నాను"అంది నంది హుందాగా.
అమ్మవారికి,అయ్యవారికి,నేరేడు,మామిడి ఆకులతో పందిరి వేయించు.నాను జాన కొమ్మలతోమండపం కట్టించు.ప్రతి రోజోఓ స్వామికి లక్ష బిల్వార్చన,అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరగాలి.అని చెప్పాడు.తదుపరి అగస్త్యుల వారుశ్రీ ఉమా మహేశ్వరుల విగ్రహ ప్రతిస్ఠాపన చేసారు.ఇదీ యాగంటి క్షేత్ర చరిత్ర.ఉమామహేశ్వరులు తమంత
తాముగా ప్రత్యక్షమయి నిలిచిన ఏకైక మహా క్షేత్రం యాగంటి.నమ
:
దీనిని కలిగోట్ల విజయాత్రేయగారు రచించారు.వారికి కృతజ్ఞతలు.

0 comments:

Post a Comment