శ్రీ లక్ష్మి గణపతి దండకం

on

శ్రీ లక్ష్మి గణపతి దండకం
శ్రీ పార్వతేయా! మహాదేవ!విఘ్నేశ !శ్రీ వారణాస్యా గణాధ్యక్ష !భక్తైక రక్షా!సురాధ్యక్ష!వి శ్వే శ ! విరూపాక్ష పుత్రా! సర్వాగ్ర సంపూజితా!సర్వ రక్షా!
మహా దేవ !దేవేశ !హేరంభ లంబోదరా!శూర్ప కర్ణా!పరానంద!ఆనందరూపా!సురూపా!వరేణ్యా !గణా దీశ !భ్రూ మధ్య సంగోచారా !ధ్యేయ రూపా! సుపద్మాసనస్తా !గుణాతీత !రుద్ర ప్రియా!విశ్వ కర్తా!విభో!విశ్వ భర్తా!కిరీటి !గవర్ణ ప్రియా!సర్వ నేత్రాధీవాసా !సుసుద్ది ప్రదా! సిద్ది నేతా!నట త్రాతా!సర్పాళి సంభూషితాంగా!సుయజ్ఞ స్వరూపా!
సుమంత్రాత్మ!కైలాస మందీవు నీయింపు సొంపుల్ వెసన్ జూపుతున్ గుజ్జు రూపంబునన్ ,బాల వేషంబునన్ ,సోదరున్ కొమలాగున్ మహా ప్రీతి వేజేరి నీతోన్దమున్వాని కంఠంబు పై వేచి హస్తంబునన్ హస్తమున్బట్టి లాలించుచున్ రమ్య మైనట్టి యారామమున్ జేరి యానంద చిత్తంబుతో నాటలాడంగా నీ తల్లి దండ్రుల్ మహాదేవుడున్ గౌరియున్ మిమ్ము వేజేరి మీయాటాలన్ పాటలన్ చూచి సమ్మోద సంపూర్ణ చేతస్కులైరవ్యయా!నీదు తత్వంబు సన్మౌని సధ్యాన గమ్యంబు వి శ్వేస్వ రా ౧సిధ్ధియున్ బుద్ధియున్ నీదు పార్శ్వంబు లన్చేరి సేవల్వేసన్ చేయుచున్దంగా హేమా ధ్య పీఠం బునన్ వెల్గు చున్నట్టి నీ ఠీవి భావించు భాక్తాలికిన్ సిద్దియున్ బుద్ధియున్ గూర్చి రక్షింతువో విఘ్న రాజా!లసద్రూప !చిద్రూప !సద్భక్త కలపా!అనంతా!అపారా!మహాదేవ సూనో!మహావిఘ్నత మిశ్రా బాలార్క తేజా!సులావణ్య తారుణ్య కారుణ్య రూపా!ఉదారా!జడా భాగ!ఎకార పీథ స్త ఇంద్ర ప్రియా !దేవ !ఓంకార రూపా!"భవద్భక్తి నావోద్ధరత్వం దయాళో సుగాత్యం తరన్నాస్తి దేవ ప్రభో మే!యటన్ చెంతు శ్రీ వక్ర తుండా!మహాప్రాణ !వర్షంబులున్ మాసముల్ పక్షముల్ వారముల్ కాల మెల్లన్ దగ న్నీవే గావా!అహోరాత్ర రూపా !సురారాధ్య !సర్వాంత రస్తా !మహారోగ భీ త్యాది నాశా !సుసిద్ది ప్రదా!సర్వ వాంచా ప్రదా!సర్వ సంపత ప్రదా!వారిజాక్షా !సదాచార !వేదాది వేదంగా మీమాంస సాన్ఖ్యాది శాస్త్రంబులున్ కావ్యముల్ పాంచ రాత్రంబులున్ నిన్ను మెప్పిమ్పగా గోరియున్ భక్తికిన్ మిన్నగా నున్డలేక పోయెన్ మహాదేవ !విఘ్నేశ !లక్ష్మి ప్రియా!బాల రూపా!"అనన్యా వలంబం మహా పాప శీలం భవ న్నేత్ర పాత్రం కురుష్వ ప్రభో మాం కటాక్షావ లోకేన కించిత్ ప్రసీదేతి "ప్రార్ధించు చుండున్ మహాశక్తి హస్తా !మహారుద్ర !సంవిత్ స్వరూపా!మహాసౌఖ్య దాటా !విధాతా!సంస్తా పరాధంబులన్ సైచి నన్నేలుకో దేవ దేవా!నమస్తే!నమస్తే!నమ:
రచన సామ వేదం రామ మూర్తి శర్మ కృత జ్ఞతలతో జ్ఞాన ప్రసూన

0 comments:

Post a Comment