dhanvantari

on

                             ధన్వంతరి

        తరు ణుండు  దీర్ఘ దోర్ద న్డుండు   కంబు కన్ధరుడు   పీతాంబర దారి   స్రగ్వి
        లాలిత భూషణా లంక్రుతున్ దరునాక్షు  డున్న తోరస్కు దత్యుత్తముండు
       నీల కుంచిత కేశ నివహుండు జలధర శ్యాముడు మృగరాజ సత్వ శాలి
       మణి కుండ లుడు రత్న మంజీరు డచ్యుతు సంకాశ నంశాంశ   డమలమూర్తి
   
                 భూరి యాగ   భాగ భోక్త ధన్వంతరి
                 యనగ  నమృత కలశ హస్తు డగుచు
                 నిఖిల వైద్య శాస్త్ర    నిపుణు   డాయుర్వేది
                 వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చె!
                                  పోతన మహాకవి  విరచితంబైన  భాగవతం లోని  దసమస్కంధం లోనిపద్యం.
అమృత మధనం జరిగినప్పుడు    మహావిష్ణువు   అంశతో    ధన్వంతరి    ఉద్భవిస్తాడు.   ఈపద్యం
ఉదయం  వేళ      భక్తితో   చదువుకొంటే     మంచి ఆరోగ్యం  కలుగుతుంది.   ఒకవేళ   అనారోగ్యం వచ్చినా
మంచి  వైద్యుడు   దొరుకుతాడు,   వైద్యునికి    సరియైన రోగం ఏమిటో తెలుస్తుంది,   దానికి  తగ్గ   మందు
తడుతుంది. ఆయన  ఇచ్చిన  మందు  రోగికి  బాగా పని చేస్తుంది.    సత్వరమే   ఆరోగ్య వంతుడవుతాడు
"మంత్రాలకు చింతకాయలు  రాల్తాయా?"అని  ప్రస్నిచేవారికోసం కాదిది.   విశ్వాస పరులైన  వారికే కోరిన
ఫలం దొరుకుతుంది.    పద్యం  గుర్తుకు రాకపోయినా ధన్వంతరి   రూపాన్ని  తలచుకొని మనసారా
నమస్కరిస్తే  చాలు.

0 comments:

Post a Comment