"రాధికేశ్వరా!" పద్యాలు
రాధి కేశ్వరా !
కృష్ణ!కృపాలవాల హరి కృష్ణ పరాత్పర కృష్ణ రుక్మిణీ
కృష్ణ ! సమస్త లోక నుత కృష్ణ జనార్దన కృష్ణ ద్వారకా
కృష్ణ !సుదర్శ నాభరణ కృష్ణ యశోద ముఖాంబు జార్క శ్రీ
కృష్ణ! ముకుంద గోపకుల కృష్ణ నిరామయ రాధి కేశ్వరా !
కృష్ణుడే తల్లి తండ్రి హరి కృష్ణుడే నా ఇలవేల్పు రాధికా
కృష్ణుడే తోడూ నీడ , ఇక కృష్ణుడే చుట్టము పక్కమున్ సదా
కృష్ణుడే దిక్కు నాకనుచు , కీర్తన చేయుచు జాటు నుంటి నో
వైష్ణవ తేజ నన్నేతుల పాలన జేసేదో! రాధి కేశ్వరా !
తలచెద నీ కృపారసము దారిని బోవుచు సంస్మరించేదన్
పిలచెద, మోక్ష మిమ్మనెద , వేడెద , పాడెద ,విష్ణు భక్తులన్
గలసెద , దుర్గుణాల్ విడె ద ,కాంతల తల్లుల రీతి చూచెదన్
నిలచెద నీ పదాల కడ ,నిన్ను భజించెద , రాధి కేశ్వరా !
కానుక నీ కొసంగుటకు కాసున కైనను మారనింక స
న్మానము చేసి ఇచ్చుటకు నాకడ కేవల మాత్మ తప్ప వే
రే నిధి లేదు ,పేద నని ఎంచక నాత్మ పరిగ్రహించి ఈ
దీనునిపై ననుగ్రహము తేటగా జూపర, రాధి కేశ్వరా !
***********************************
ఈపద్యములు వ్రాసిన రచయిత ఎవరో తెలియదు. రాధికెశ్వరా అనె శతకం రచించారెమో! పద్యాలు హృద్యమం గా వున్నాయని
సాహితీ మిత్రులకు అందిస్తున్నాను . అజ్ఞాత కవికి కృతజ్ఞతలతో
టి . జ్ఞాన ప్రసూన