"రాధికేశ్వరా!" పద్యాలు

on

                        రాధి కేశ్వరా !

    కృష్ణ!కృపాలవాల   హరి కృష్ణ  పరాత్పర    కృష్ణ రుక్మిణీ 
    కృష్ణ !  సమస్త    లోక   నుత   కృష్ణ   జనార్దన   కృష్ణ ద్వారకా 
    కృష్ణ !సుదర్శ నాభరణ కృష్ణ    యశోద    ముఖాంబు జార్క  శ్రీ 
    కృష్ణ!    ముకుంద    గోపకుల   కృష్ణ    నిరామయ      రాధి కేశ్వరా !

    కృష్ణుడే   తల్లి తండ్రి   హరి   కృష్ణుడే     నా  ఇలవేల్పు రాధికా 
    కృష్ణుడే    తోడూ నీడ ,  ఇక     కృష్ణుడే    చుట్టము  పక్కమున్   సదా 
    కృష్ణుడే     దిక్కు నాకనుచు   ,  కీర్తన     చేయుచు     జాటు నుంటి నో 
    వైష్ణవ    తేజ   నన్నేతుల   పాలన   జేసేదో!      రాధి కేశ్వరా !

    తలచెద    నీ    కృపారసము     దారిని    బోవుచు సంస్మరించేదన్ 
     పిలచెద,   మోక్ష మిమ్మనెద , వేడెద ,  పాడెద ,విష్ణు భక్తులన్ 
     గలసెద ,    దుర్గుణాల్   విడె ద ,కాంతల    తల్లుల   రీతి    చూచెదన్ 
    నిలచెద  నీ పదాల కడ ,నిన్ను   భజించెద ,  రాధి కేశ్వరా !

   కానుక    నీ కొసంగుటకు   కాసున కైనను    మారనింక    స 
   న్మానము  చేసి   ఇచ్చుటకు   నాకడ   కేవల     మాత్మ   తప్ప   వే 
    రే    నిధి    లేదు ,పేద నని   ఎంచక   నాత్మ   పరిగ్రహించి  ఈ 
   దీనునిపై   ననుగ్రహము   తేటగా    జూపర,    రాధి కేశ్వరా !

          ***********************************
 ఈపద్యములు     వ్రాసిన   రచయిత    ఎవరో    తెలియదు.   రాధికెశ్వరా   అనె    శతకం    రచించారెమో!  పద్యాలు హృద్యమం   గా      వున్నాయని 
సాహితీ    మిత్రులకు     అందిస్తున్నాను .  అజ్ఞాత    కవికి    కృతజ్ఞతలతో 
టి .    జ్ఞాన    ప్రసూన 

1 comments:

శ్యామలీయం said...

పద్యాలు చాలా బాగున్నాయండీ. కొన్ని పద్యాలలో కొన్ని కొన్ని దీర్ఘాంతపదాలను హ్రస్వాంతములు చేయాలి - లేకుంటే గణాలు కుదరవు. బహుశః యెత్తి వ్రాయటంలో పొరబడి ఉంటారనుకుంటాను.

( మీకు రామచంద్రులవారి మీద పద్యాలు కూడా నచ్చుతాయని భావిస్తున్నాను, శ్యామలీయం బ్లాగులో పాహి రామప్రభో అనే‌ శీర్షికన పద్యాలు ప్రచురిస్తున్నాను కొన్నాళ్ళ నుండీ. తప్పక చూడండి.)

Post a Comment