పరమేశ్వర ప్రార్ధన
శివస్తుతి పరమేశ్వర ప్రార్ధన
శృంగారపురంలొ నివసించిన శ్రీ నాగేశ్వరం సుందర శర్మ గారు శ్రీ భగవన్నామ సంకీర్తన మాల అనే కీర్తనలు రచించి పుస్తకం ప్రకటించారు.ఇది అమూల్యం .భక్త వరేణ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం ఉచితంగా పంచాలని సంకల్పించి ఆ రోజుల్లొ పోస్ట్ ఖర్చులకు రెండు అణాల పోస్ట్ బిళ్ళలను పంపిస్తె పుస్తకం పంపుతానని వెనక అట్టమీద ప్రచురించారు.ఆపుస్తకం యాదృచ్చికం గా నాదగ్గరికి చేరింది. శివ స్తుతులు హృద్యమంగా వున్నాయి. కార్తీక మాస సందర్భంగా వీటిని గుడిగంటలు బ్లొగ్ మిత్రులకు అందిద్దామని అనిపించింది. విజ్ఞాపన లో విళంబి ,అధిక శ్రావణం ,13, సోమవారం అనివుంది. రచయితకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.
జ్ఞాన ప్రసూన
పరమేశ్వర ప్రార్ధన
శ్లోకము
మాతాచ పార్వతీ దేవీ ,పితాదేవో మహేశ్వర:
బాంధవా: శివ భక్తాచ ,స్దేశొ భువన త్రయం
కల్యాణి రాగం -ఆట తాళం
దేవాది దేవా బ్రోవ రావా
దేవ బ్రోవా వేగ రావా
దేవా-కావా-రావా-శివా దే
1.ఆదిమధ్యాంత రహితా -ఆనందమయ సుచరితా
వేదవిహిత యోగివినుత-ఆది దేవ అమర వందిత దే
2.జగములను సృజించి -మరితగునేర్పునబెంచి
పగలేక యడంచి -జగములేలు నీ లీలనుంచి దే
3.సర్వ వేద కర్త వీవె -సర్వ మత ప్రవక్త వీవె
సర్వ భక్త గమ్య మీవె -యుర్వి భేదము లణచి కావవె దే
4.రజత గిరి నివాసా -రంజిత గౌరి విలాసా
విజిత మన్మధ రోషా -భుజ భూష భక్త సుపోష దే
5.మూడు కనులు గల్గు వాడా -చూడుము దయ నను చంద్ర చూడా
వేడితి గంగను దాల్చు రేడా - వేగమె కావర -తెల్లరేడా దే
6.దాపుజేరితిని మంచి-ప్రాపు నీవనచునెంచి
[నా] పాపముల ద్రుంచి -కృప వహించి దీనుని గాంచి దే
7.అన్ని జన్మములలో-హన్న మానవ జన్మములో
నిన్ను సన్నుతింపక ,మదిలో-బన్నుగ జన్మ తరింపదు -భువిలో దే
8.తనయులు తగు భార్య యున్న-
ధనగృహ క్షేత్రాదులున్న -తన తోడుత రాకయున్న
తన విధి తప్పింప లేరన్న దే
9.తల్లితండ్రి గురువు నీవే -యెల్ల బంధు మితృ లీవే
కల్లగాదు నా దైవము నీవే -వల్లభ- కరుణించిరావే దే
10.స్నాన సంధ్య జపము -దాన ధర్మ తపము
జగద్ వల్లభ కరుణించి రావే దే
11.ధరను వెలయు శృంగార -పుర విహార మల్లేశ్వర
వర సుందర నుత ధీరా -కరుణ రత్న హార మిదే గొనర దే

0 comments:
Post a Comment