సంత రామదాస్
సంత రామదాస్
సంత రామదాస్ ఒకసారి బిక్షాటన చేస్తూతిరుగుతున్నారు.
ఒక ఇంటి ముందు నిలబడి "జయజయ రఘువీర సమర్ధ " అని బిగ్గరగా కేకపెట్టారు.ఆ ఇంటి ఇల్లాలు అస్సో ఇస్సో అంటూ ఏదో పనిచేసుకొంటూంది.మధ్యలో ఈయన కేకవిని చిరాకుపడి చర్రున బయటికి వచ్చి చేతిలో వున్న అలుకు గుడ్డ పొయ్యి అలుకుతున్నది ఆయన మొహం మీద విసిరేసి"తీసుకో బిక్ష" అంది క్రోధంగా .సంత రామదాస్ సాధన్యవాదాలతో ఆ విచిత్ర బిక్ష స్వీకరించి ఆమెను ఆశీర్వదించి తన దారిన తానూ వెళ్ళిపోయాడు.ఆ బిక్షను తీసుకొని ఆయన సరాసరి నదికి వెళ్లి ఆ అలుకు గుడ్డని శుభ్రంగా వుతికారు. మఠానికి వచ్చి దానిని ఎండలో ఆరవేసి ఎండాక దానితో వత్తులు చేసి ఆవునేయితో తడిపి భగవంతునికి ఆరతి ఇచ్చేందుకు వుపయోగించారట.భగవంతుని ఇలా ప్రార్ధించారట."వట్టినుంది వచ్చే ప్రకాశం అన్ధకారాన్నేలా పారత్రోలుతుందో ఇది ఇచ్చిన అజ్నానురాలి హృదయంలోని అజ్నానాన్ధకారాన్నికూడా అలాపారత్రోలాలి ప్రభూ!"అని.ఇంకేముంది!సద భక్తుని సత్ప్రార్ధనని స్వామీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తాడా?ఇలా ప్రార్ధన చెయ్యడ మేమిటి,ఆస్త్రీ హృదయం లోని అసత్ప్రవ్రుత్తులన్ని నిశ్శేషంగా దూరమయిపోయాయి.వెంటనే ఆమె అనన్య భావంతో సంత రామదాస్ దగ్గరికి వెళ్లి తను చేసిన మహాపరాదానికి వేయి క్షమాపణలు వేడుకొంది.ఆయన చూపించిన కరుణకు ముగ్దురాలయింది.భగవద్ భక్తికి అర్హురాలయింది.పెద్ద మనసున్నవారు అపకారికి ఉపకారమే చేస్తారు.

2 comments:
బాగుందండి, అందుకేనేమో అపకారికి నుపకారము నెపమెన్నకసేయువాడు నేర్పరి సుమతీ అన్నారు :)
సంత్ మహాత్ములు అపకారి పట్లకూడా సమానమైన దయగలిగి ఉంటారని ఈకధ ద్వారా తెలుస్తోంది .మంచికధ చెప్పారు .
Post a Comment