నిజాయితీ

on

నిజాయితీ
అనగనగా ఒక వూళ్ళో కట్టేలుకొట్టుకొనే అతను ఒకడు ఉండేవాడు.శీలవంతుడు,పరమార్ధం ఎరిగినవాడు,సరళ స్వభావుడు.ఇతన్ని గురించి మహమూద్ అనేరాజు విని చూడాలని పిలిపించి అతని సాదుత్వానికి ముచ్చటపడి తన రాజ్యానికి ప్రధాన మంత్రిగా నియమించాడు.కట్టెలు కొట్టుకొని బ్రతికే ఇయాజ్ కి ఈపదవిపై ఏమాత్రం మోజులేదు,అయినా రాజాజ్నని తరస్కరించలేక అంగీకరించాడు.ఇయాజ్ ప్రధాన మంత్రి కాగానే రాజ్యంలో కట్టుదిట్టాలు ఎక్కువ చేసాడు.అన్యాయాలు,అత్యాచారాలు,భ్రష్టాచారాలు అన్నీ అంతరించిపోయాయి.
స్వార్ధ పరుల ఆట కట్టే సరికి వారికి ఇయాజ్ పై ద్వేషం పెరిగి రాజుగారికి రోజూ ఒక పితూరీ ఇయాజ్ ను గురించి అందించడం ప్రారంభించారు.వాళ్ళు చెప్పిన దేమిటంటే ఇయాజ్ కి ప్రధాన మంత్రి పదవి వచ్చినప్పటినుండీ చాలా వజ్రాలు,రత్నాలు పోగుచేసాడని, రాత్రి వేల ఏకాంతంగా కూర్చుని వాటిని చూసుకొని మురిసిపోతూ ఉంటాడని.
ఇయాజ్ దాచిన ఆ సంపదని చూడాలని రాజు ఇయాజతోచెప్పాడు.ఇయాజ్ వినమ్రంగా అంగీకరించి "మీ ఆజ్ఞా పాలన చేయడం నా విధి,కానీ రాజా !మీరు వాటిని చూడాలని కోరుకోవడం మంచిది కాదు,అన్నాడు.రాజు చూడాలని పట్టు పట్టాడు."మీ ఆదేశానుసారం చూపిస్తాను,కానీ నా పై వచ్చిన ఆరోపణలు అబద్ధం అని రుజువయితే నేనేది అడిగితె అది నాకు మీరు ఇయాలి.అన్నాడు ఇయాజ్.రాజు సంతోషంగా ఇస్తాను,దానికేమి భాగ్యం?అన్నాడు.రాజుగారు ముఖ్యోద్యోగులను పిలిపించారు,అందరూ ఇయాజ్ శయన మందిరంలో గుమిగూడారు.రాజు అందరి సమక్షములో ఇయాజ్ పెట్టె తెరిచాడు.అందులో రెండు పాత వస్త్రాలున్నాయి.ఇదేమిటి?అన్నాడురాజు .
"నేను బీదరికంలోంచి ప్రధాన పదవికి వచ్చాను.అధికారంతో నాకు అహంకారం రావచ్చు,అందుకని నాపూర్వపు రోజులు మర్చిపోకుండా ఈ పాత వస్త్రాలని రోజూ చూసుకొంటూ వుంటాను,అని ఇయాజ్ సమాధాన మిచ్చాడు.రాజు పులకిత గాత్రుడై "అయితే నీకు ఏమిబహుమానం కావాలో కోరుకో!అన్నాడు."నాకేమీ అఖ్ఖరలేదు,ఈపదవినుంది విముక్తి కలిగించండి అదేచాలు,నా శేష జీవితం పరమాత్ముని పాద సేవలో గడుపుకొంటాను,అన్నాడు ఇయాజ్."సాదువర్తనులైన వ్యక్తులు ఎల్లప్పుడూ సత్యమార్గాన్నే కోరుకొంటారు"అంటుంది వేదం .
{వేద సవితనుండి}

0 comments:

Post a Comment