ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
కర్తవ్య మేమిటో కాస్త చెప్పు.
నీ పజ్జ చేరితిని నీవే నా దిక్కంటి
ఎదిక్కు ఏగనో ఎరుక చెప్పు
ఆ సజ్జనుల చూపు, మంచి మాటలు చెప్పి
మదిని అద్దము వోలె మార్చ గలరో!
నేను నేనంచు గుండెలు బాదు కొనెడి
అహము నన్నెపుడు విడుచునో ఈ
అల్పమైన జీవనం బిట్లే సాగునా చేవలేక
నీదు పాదము పట్టితి నిక్కముగను !
0 comments:
Post a Comment