శ్రీ సత్యనారాయణ వ్రత కథా గానము - 2

on



ద్వితీయాధ్యాయము


మునులారా ముదముతో వినుడు రమానాథ
ఈవ్రతంచేసిన వారికథ ఇంపుగా ''
కాశినగరమున ఒక బ్రాహ్మణుడు ''
అతడతి రిద్రుడయ్యా ''
ఆకలి బాధతో అలమటించు చుండే ''
దీశామంతా తిరుగు చుండే ''
బ్రాహ్మణుని దశకనెను శ్రీహరి ''
ఒక వృద్ధ బ్రాహ్మణ వేషమువేసి ''
ఆతనిని కలుసుకొనెను ''
వేదవిదుడ వాయి బ్రాహ్మణుడా ''
ఇట్లు కష్టములు పడుట ఏమి ''
అప్పుడా బ్రాహ్మణుడు నమస్కరించి ''
ప్రభూ !నీను మిక్కిలి దరిద్రుడను ''
బిక్షాటన చేసుకోనుచు ''
నేను గడప గడప తిరుగు చుంటి ''
ఎంత కష్ట పడినాను ''
పొట్ట గడవడమే దుర్లభ మయ్య ''
అందుకేమైనా ఉపాయం చెప్పు ''
అని అడిగిన వెంటనే ముసలి బ్రాహ్మణుడు ''
అయితె విను చెప్పుచున్నా ననే
ఇలలో సత్యనారాయణ మూర్తి
కోరిన కోరికలు తీర్చు వాద్య ''
సత్యనారాయనమూర్తి వ్రతం
నువ్వు ఆచరించ వలెనయ్య ''
నీసర్వ దుఃఖములు తొలగి ''
నీవు సంపదలు పొందుదువయ్య
వ్రతము నీవు చేయవయ్యా ''
ఆవ్రతం చేయు విధానం తెలిపి
ఆముసలి బ్రాహ్మణుడు అదృష్యుదయ్యే ''
అప్పుడు ఆబీద బ్రాహ్మణుడు ''
రేపెఆవ్రతం చేతునని పలికే ''
ఉత్సాహంతో రాత్రి నిద్రలేక ''
ఎప్పుడు తెల్లవారునాయని చూచే ''
ఉదయమవగానే లేచి బ్రాహ్మణుడు ''
కాలక్రుత్యములు నిర్వర్తించి ''
నేడు తప్పక వ్రతం చేయాలి అని ''
నిశ్చయంతో వెడలె బిక్షకు ''
ఆరోజు ఆశ్చర్యముగా ''
అతనికిఎంతో ద్రవ్యము లభియించే ''
ఆధనముతో ఇంటికి వచ్చి ''
బంధువులను ,బ్రాహ్మణులను పిలిచి ''
యథావిధిగా వ్రాత మాచరించే ''
సత్యమూర్తి ప్రభావమున ''
అతని దరిద్ర మంతా తొలగిపోయే ''
అదిమొదలు ఆబ్రాహ్మణుడు ''
రోజూ శ్రద్ధతో వ్రతం చేయసాగే ''
ప్రతి దినం వ్రతం చేసి ' అతడు అపార సంపత్తి పొందే ''
పాప విముక్తుడై మోక్షమును పొందే ''
ఈవ్రతము నెవరు భక్తీ తోడ ''
విముక్తి పొందుదురు ''
శ్రీహరి నారద మునికి చెప్పిన సంగతి ''
మీకు చెప్పితిని అని పలికే సూతముని ''
బ్రాహ్మణుని వలనవిని సూతముని ''
ఇంకాఎవరీ వ్రతము చేసినారో ''
దయతో మాకు వివరిమ్పుమని కోరిరి మునులు ''
ఒకసారి ఆబ్రాహ్మణుడు ''
శక్తి కొలది వ్రతము చేసే ''
బంధువులు మిత్రులు ఎందరో వచ్చిరి ''
పుల్లలమ్ము వాడు వచ్చి నిలిచి ''
పుల్లల మోపు బయట వుంచి లోనికోచ్చి ''
సత్యనారాయణ వ్రతం చూసే ''
ఎన్ని కట్టే లమ్ముకొన్న ''
నా ఆకలి దప్పులు తీరుట లేదు ''
ఈపూజ చేసు కొంటే ధనం లభించు నేమో ''
బ్రాహ్మణునిట్లు ప్రశ్నించెను ''
మీరు చేయు చున్న వ్రతమేమి ''
అది చేసిన ఏమి ఫలము కలుగు ''
వివరముగా తెలుపుడని ప్రార్ధించే ''
కలియుగంలో శ్రీహరి అవతారం సత్యమూర్తి ''
అతని వ్రతం చేస్తే ఎంతో పుణ్యం ''
ఇది సకల కష్టములు హరియించు ''
సకల కామితార్ధము లిచ్చు ''
సకల భోగ భాగ్యాలిచ్చు ''
కట్టేలమ్ము వాడదివిని ''
ప్రసాదం తిని ''
సుష్టుగా భోంచేసి ఇంటికే వెళ్లి ''
నేనును సత్యమూర్తి వ్రతం చేతునని ''
ఉత్సాహం పొంగాగాను ''
పుల్లల మోపు నెత్తిన పెట్టుకు ''
ఇట్లు తలపోసే మనసులోన ''
ఈపుల్లలు అమ్మగా ధనమెంతోస్తే ''
అంత పెట్టి వ్రతము చేతు నని ''
అనుకొని నగరమున పుల్లలమ్మబోయే ''
మంచిధనవంతులున్న వీధికిపోయి ''
పుల్లలన్ని 'అమ్మేనాతడు '
ఎప్పుడు రానంత ధనమోచ్చే నతనికి ''
అరటిపళ్ళు ,నేయి ,పాలు ,సక్కేర ,గోధుమ నూక ''
సేరుమ్పావు చొప్పున కొని ఇంటికి వెళ్లి ''
ఇల్లు వాకిలి శుభ్రం చీసి ''
బంధు మిత్రులని పిలిచి ''
బహు శ్రద్ధ తోడ
సత్యనారాయణ వ్రతం చేసి నాడు ''
వ్రత ప్రభావము వలన కొద్ది రోజులలో ''
ఎంతొ ధన వంతుడయ్యే '
పుత్రుడు కలిగే పుత్రికలు కలిగే ''
బ్రతికి నంత కాలమ్ సుఖముగా నుండే ''
అన్త్యమున స్వర్గమును పొందే ' '
ద్వితీయ అధ్యాయము సమాప్తము

ఇంకొక కథ చెపుతాను విను రమానాథా
పూర్వం ఉల్కాముఖు డనే రాజుకలడు ''
నిత్య సత్య vratu
ఇంద్రియములను జయించిన వాడు ''
ఎరోజూ దేవాలయమునకు పోవుట మరువడు ''
దానములిచ్చుట తృప్తి అతనికి ''
రాజు భార్య అతి సౌందర్య వతి ''
మంచి గుణము కలది ఉత్తము రాలు ''
భద్రశిలా నది కలదచట ''
ఆతీరమున కూర్చుని ''
సత్యమూర్తి వ్రతం సలిపిరి వారు ''
ఉల్కాముఖుడు భార్యా కలసి ''
వైభవంగా పూజ చేసినారు ''
డొకడు ''
వర్తకమునకు పోవుచుండె ''
పడవ నిండా ధనముండే ''
దారిలో ఆగి వ్రతము చూడ వచ్చే ''
ఏమివ్రతము చేయు చుంటివి మహారాజా ''
వ్రత విధాన మేమి వివరం చెప్పు ''
వినవలె నని కోరిక గలిగె ''
చెప్పి పుణ్యం కట్టుకోవయ్య ''
పుత్ర సంతానంకోరకు ''
మేము ఈవ్రతము చేయు చున్నాము ''
వ్రత విధాన మిదియని ''
సవిస్తరముగా చెప్పే నతడు ''
నాకును సంతానం లీడు మహారాజా ''
నీను ఈవ్రతం చీసి సంతతిని పొండుడును ''
అని వర్తకమునకై వెడలె నతడు ''
పడవ లోని సరుకంతా అమ్మే ''
తన నగరం చేరి ఇంటికి వెళ్లి ''
భార్య లీలావతికి ఈవ్రతం సంగతీ వివరించి ''
మనకు సంతానం కలిగిందంటే లలనా
మనము తప్పక సత్యనారాయణ వ్రతం చేద్దాం ''
భర్తా చేసిన ప్రటిజ్న విని లీలావతి ''
మనసు ఆనందంతో మునకలు వేసే ''
కొద్ది దినములకు సత్యమూర్తి దయ వలన ''
లీలావతి గర్భవతి యయ్యె ''
నవమాసముములు మోసి మురిసి పోయి ''
పదియవ మాసమున కుమార్తెను గానే ''
కళావతి యని నామకరణం చేసిరి''
అర చేతులలో పెంచిరి పిల్లను ''
శుక్ల పక్ష చంద్రుని వలెను ''
లలన దిన దిన ప్రవర్ధ మాన మయ్యె ''
ఒకనాడు లీలావతి భర్తతో ''
మనకు సంతానం కలిగిందంటే ''
సత్యనారాయనవ్రతం చేస్తానంటిరి ''
సత్యమూర్తి అనుగ్రహంతో ''
ఆడపిల్ల నట్టింట తిరుగు చుండే ''
చేసిన ప్రతిజ్ణ మరచి పోవుట ''


అన్నిటి కంటే మహాపాపం ''
ఇప్పటి వరకు వ్రతము మనము ''
చేయకుండుటకు కారణమేమి ''
భార్య మాట విని భర్త చిరు నవ్వుతో
తొందర ఎమోచ్చిందోయే వ్రతానికి ''
అమ్మాయి పెళ్లి అప్పుడు తప్పక చేద్దాం ''
అనిచెప్పి వర్తకమునకు పోయే
కలావతికి యుక్త వయస్సు వచ్చి నంతనే ''
వివాహం చేయాలని నిశ్చయించి వర్తకుడు ''
యోగ్యమైన వరుని చూడ దూతల నమ్పే ''
కాంచన నగరము లోన ఒక వైశ్య కుమారుని ''
అంద చందాల్ గుణ గణా లెంచి అతన్ని ''
నిశ్చయించి వెంట తీసుకొని వచ్చే నతను ''
పెండ్లి కొడుకును చూసి సాధువు సంతసించి ''
తనకుమార్తే నిచ్చి వైభవంగా పెళ్లి చేసి ''
అతి సంతోషమున మునిగి
వైశ్యుడు వ్రతము సంగతే మరచే ''
అతని మరపు చూసి సత్యమూర్తి దీవుడు ''
అతి క్రుద్దు డు అయినాడయ్య ''
కొంత కాలము గడిచిన వెనుక ''
ల్లునితో చంద్ర కేతు మహానగరమునకు ''
వ్యాపారంకోసం వెళ్ళే నతడు ''
వ్రతము చేసెదనని మ్రొక్కి ''
ఇంట కాలకుచేయకున్డుతచే '
సత్యనారాయణ స్వామికి కోపం వచ్చెఇ '
ఇతనికి దారుణమైన ఖటిన మైన d;ఉఖంకలిగి ''
అని వైస్యుని సపించే సత్యనారాయణ స్వామి ''
అప్పుడే కొందరు దొంగలు ''
రాజుగారి ధనాగారములోన ''
ధనము నపః రించి నారు ''
వారు సాదువున్న చోటికి వచ్చిరి ''
దొంగతనం కనిపెట్టి రాజ భటులు ''
దొంగల వెంట పరుగేట్టిరి ''
తమ వెనుక రాజభాతుల చూసి ''
దొంగలు భయ భ్రాన్తులినారు ''
ధనము తమ వద్ద వుంటే ''
చావుతప్పదని వారు ''
ఆధానము వర్తకుల వద్ద పెట్టి పారిపోయిరి ''
రాజ భటులు వచ్చి వెతికి ''
ధనము వైశ్యుల వద్ద నుండుట చూసి ''
వీరే ''
మామా ,అల్లుల్లని తాళ్ళతో బంధించిరి '' చతుర్దాధ్యాయము

మంచి రోజులు వచ్చే నని మామ ఆల్లుళ్ళు రమా నాథా
తీర్థ యాత్ర లెన్నో త్రోవలో చేసారు ''
బ్రాహ్మణులకు , బీదాబిక్కికి ''
దానధర్మాలెన్నో చేసారు ''
తమనగరమునకు ప్రయాణ మైరి ''
సముద్ర తీరాన వెళ్ళు చుండిరి ''
ఇది చూసి సత్య నారాయణ స్వామి ''
వీరిని పరీక్షించ నిశ్చయించీ ''
కలావతి ,లీలావతి ఎట్టకేలకు ''
నామహిమ తెలిసి నావ్రతము చేసిరి''
వైశ్యునకు ఇప్పటికైనా ''
నావ్రతం సంగతీ గుర్తు రాదా ? ''
సత్యమూర్తి సన్యాసి వేషమున ''
వారివద్దకు వచ్చి ఇట్లనెను ''
వర్తకులారా ! పడవ యందు ఏమి వున్నవి ? ''
వర్తకులు విజయ గర్వముతో ''
మదొన్మత్తులైఒడలెరుగా కుండిరి ''
మా పడవలో ఎమున్నా నేమి సన్యాసీ ! ''
నీ కెందు కయ్యావాటి సంగతీ సన్యాసీ !
నీవు దొంగతనము చేయ వచ్చి తి వి ఒసన్యాసీ ! ''
ఈపడవలో ఏమీ ధనములేదు సన్యాసీ ! ''
వట్టి ఆకులు అలములు తప్ప ఒసన్యాసీ ! ''
అనిన విని సత్యదేవుడు చిరు నవ్వుతో ''
"ఆకులు అలములే వుంటాయి లే " అని వెడలె ''
అల్లంతదూరం పోయి నిలచే ''
మామా ,అల్లుడు పడవ దిగి ''
కాలక్రుత్యాల్ తీర్చుకొని వచ్చినారు ''
పడవ దగ్గర పోగానే ''
అది కాగితం పడవలా తెలు చుండే
పడవలోకి వెళ్లి చూడ ''
ధనమునకు బదులు ఆకులు వుండే ''
వైశ్యుడు చూసి మూర్ఛ పోయే ''
తెలివి వచ్చి విల పింప సాగే ''
అప్పుడు అల్లుడు మామను చూసి ఇట్లనే ''
సన్యాసి శపించెను కదా !అందువలన ''
ఇట్లు ధనము ఆకులలములయ్యే ''
అతని వెదికి ప్రార్ధింతుము ''
అతడే తిరిగీ మన ధనము మన కియ్యగలడు ''
అల్లుడుమాట నిజమని ''
సన్యాసి వద్దకు పోయిరిరువురు ''
మహాత్మా అనినమస్కరించి ''
మీము అవివేకము తో ప్రేలినాము ''
మా అప రాధము క్షమిమ్పవయ్య ''
అని అన్ని విధముల ప్రార్ధించిరి ''
ఇప్పటికైనా బుద్ది వచ్చేనా ! వెర్రివాడా ! ''
నీవు సత్యనారాయణ వ్రతం చేస్తానని ''
మాట తప్పి మరచినావు ''
దానివలననీ దారుణ దు :ఖం ''
వైశ్యుడు చేతులు జోడించి ''
ఈలోక మంత నీ మాయచే నిండెను ''
బ్రహ్మాది దీవతలు గుర్తింపలేరు ''
అజ్నానుడను ,మూర్ఖుడను ''
మూఢుడను , జడమతిని ''
నిన్ను అనేక విధముల ప్రార్దింతును ''
నాపై కరుణ జూపి రక్షించు ''
నా ధనము నాకు అంద చేసి ''
నాకుటుంబమును కాపాడ వయ్యా ''
అతని విన్నపాలు వినిస్వామికి దయ కలిగి ''
తిరి గి ధనమునంత ఇచ్చేసి అద్రుశ్యు డయ్యె ''
మామా ,అల్లుడు పడవ ఎక్కి చూడగానే ''
ఆకులుపొయి రూకలు వచ్చే పడవలో ''
స్వామికి కృతజ్ఞతా తెలిపి ''
కడు ముదముతో ఇరువురు వెడలిరి ''
స్వనగరము దాపుకు రాగానే ''
అదేనోయి , మనవుఉరు వచ్చివేసాం ''
అని అల్లునికి మామ చూపించాడు ''
సేవకునిపిలచిభార్యకు , బిడ్డకు ''
తమరాక తెలిపి రమ్మనేను ''
సేవకుడు వర్తకుని ఇంటికి వెళ్లి ''
కళావతికి , లీలావతికి ''
వారిపతులరాక నేరిగించి ''
త్వరలో వస్తున్నారనే ''
లీలావతి ఈమాటలువిని ''
ఆనందం పట్టలేకపోయే ''
మన వాళ్లు వచ్చేసారటే అమ్మాయీ ''
వ్రతం త్వరగాముగించి రావే పోదాం ''
పూజ పూర్తి చేసినారు వారిరువురు ''
తొందరలో ప్రసాదం తినలేదు ''
అందువలన సత్య మూర్తికి కోపం వచ్చి ''
ధనముతో సహా పడవను నీట ముంచే ''
పడవతోపాటు అల్లుడు కూడా మునిగి పోయే ''
లీలావతి నెట్టి బాదుకు ఏడవ సాగే ''
అల్లుడా ! కళ్ళెదుట నీట మునిగితివా ''
ఇది అంతా స్వామి మాయ నిశ్చయముగా ''
అని కుమార్తెను కౌగాలించుకు విల పించే ''
భర్త మృతి చెందేననివిని కళావతి ''
అతని పాదుకలతో సహగమనము ''
చేయుదు నని నిశ్చయించీ ''
స్వామికి కోపం వచ్చెనని షావుకారు ''
చీత ఇట్లయ్యేనని ''
నా శక్తి కొలది వ్రతము చేతు ''
భక్తీ శ్రద్ధలతో ప్రార్ధింతు ''
స్వామిని తలచి సాష్టాంగ పడి ''
అనీక విధముల స్తుతియించే ''
అప్పుడు సత్యదేవుడు సంతోషించి , ఇట్లనెను ''
భర్త వచ్చినాడను ఆనందముతోను ''
నీకుమార్తే నా వర ప్రసాదము ''
తినకుండా పడవ దగ్గర కొచ్చే ''
అందువలన భర్త ఆమెకు ''
కనిపించకుండా మునిగిపోయే ''
ఇంటికి పోయి ప్రార్ధించి ''
ప్రసాదంతిని వచ్చిన వెంటనే ''
అల్లుడు జీవించి వచ్చు ''
అంతయు శుభ కర మగును ''
ఆకాశ వాని వినిన తోడనే కలావతి ''
పరుగుపరుగున ఇంటికి పోయి ''
ప్రసాదమును స్వీకరించి ''
తిరిగీ పడవ వద్దకు వచ్చే ''
వచ్చి చూచు సరికే అచట ''
పడవనీటిపై తీలి యుండె ''
ఆమె భర్తా కూడా కను పించే ''
అది చూచి అందరు ఆనందిన్చిరి ''
తండ్రీ !ఆలస్య మింకీల మనకు ''
భక్తీ శ్రద్ధలతో వ్రతం చేద్దాం ''
ఆమాటవిని షావుకారు ''
బంధువులతో కలసి నదిఒడ్డున ''
వ్రతము చేసి సుఖముగా ఇంటికి చేరే ''
జన్మ అంతా షావుకారు ''
పౌర్ణమి దినమునవ్రతము చేసే ''
రవి సంక్రమణ దినమున కూడా చేసే ''
అట్లు నియమము తప్పక పూజ చేసి ''
సకల భోగాలు అనుభ వించి ''
అన్త్యమున సత్య పురికి పోయే ''
చతుర్ధ అధ్యాయము సమాప్తము

పంచమాధ్యాయము

సూత మహాముని మరల మునుల చూసి రమానాదా
ఇంకొక కథ చెప్పెద వినుడు ''
తుంగధ్వజుడనే రాజుకలడు ''
ప్రజలను కన్న తండ్రివలే చూచు ''
అరణ్యమునకు వేటకు బోయి ''
తిరిగీ వచ్చునపుడు ఒక చోట ''
గొల్లలందరూ సత్యనారాయణస్వామి ''
వ్రతము చేయు చేయు చుండి రచట ''
గర్వముచే రాజు ఆటకు పోలేదు ''
స్వామికి నమస్కారమైన చేయలేదు ''
ప్రసాదము తినని తప్పుకు ''
వారి నూర్గురు కొడుకులు చనిపోయిరి ''
ధన ,ధాన్యములు అంతరించే ''
లెక్కలేని కష్టములు వచ్చే ''
అపుడు రాజు కళ్లు తెరచి ''
"రాజుననే గర్వముతో నేను " ''
ప్రసాదమైనా భుజింపక వస్తి ''
నేను పొగరుగా ప్రవర్తించాను ''
ఆస్వామికి కోపము వచ్చే ''
నాఐశ్వర్య మంతా నశించిపోయే ''
అని రాజు మరల గొల్లల దగ్గిర కేగినాడు ''
యథా విధిగా సత్యమూర్తి వ్రతము చేసినాడు ''
స్వామి కృప వలన మరల పుత్రులు కలిగి నారు ''
ధనవంతుడాయి సుఖముగా బ్రతికినాడు ''
చివరికి స్వర్గ మునకు పోయినాడు ''
మహా ప్రభావ వంత మైన ఈవ్రతము ''
భక్తితో ఎవరాచరింతురో ''
కథ ఎవరు విన్దురో ''
వారికి సకల ఐశ్వర్యములు కలుగు ''
దరిద్రునకు ధనము వచ్చు ''
బద్ధుడు విముక్తు డగును ''
భయ భీతునకు ధైర్యము కలుగు ''
అపుత్రునకు పుత్రులు కలుగు ''
ఇహలోకమున సకల సౌఖ్యాలు ''
అన్త్యమున స్వర్గ లోకము ''
ఇట్టిఫలముల నిచ్చేటట్లు ''
సత్యనారాయణ వ్రతము తెలిపితి ''
కలియుగమున ఈవ్రతము ''
ప్రత్యక్షమైన ఫలము నొసగు ''
విశేష ఫల ప్రదమైనది ''
దీనినందరు ఆచరింప వలయు ''
కలియుగమున స్వామిని కొందరు ''
సత్యీశ్వరుడు , సత్యదేవుడని యందురు ''
సనాతనుడైన శ్రీహరి ''
కలియుగమున అనెకరూపముల ''
అవతరించి జనులందరికీ ''
కోరిన కోరిక లోసగు చుండును ''
ఇది సత్యము ,ముమ్మాటికీ సత్యము ''
ఈవ్రతము తామూ చేయ లేక పొతే ''
ఎవరైనా ఈవ్రతం చేస్తూంటే '
చూసిన ,కథను భక్తితో వినిన ''
సత్యనారాయణ స్వామి అనుగ్రహం ''
కలిగి ,కష్టములు తొలగు నయ్య ''
తటవర్తి భారతం జ్ఞాన ప్రసూనాంబ ''
వంశాన్ని కాచి రక్షించు సత్యనారాయణా ''
ఈపాటను పాడినా వారికి , వినిన వారికి ''
పలు శుభాములు మోక్ష ప్రాప్తి ప్రసాదించు ''
సత్యనారాయణ స్వామీ సంతసించి ''
ఆసీస్సులందించి మమ్ముల ధన్యం చేయి ''
సంపూర్ణం

0 comments:

Post a Comment