సత్య సాయి బాబా అష్టకం

on

సత్య సాయి బాబా అష్టకం
రచన టి.జి. ప్రసూన


పర్తి పురమున వెలసినావట
పాపులను రక్షించగా
ఆర్తి బాపగా అవతరించిన
ఆదిమూర్తివి నీవట
కర్తవు కర్మవు నీవే
కామితము లందింపవా ని
వ్రుత్తి భావము నింపవా మది
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
సత్య , ధర్మమూ , శాంతి , ప్రేమయు
నాల్గు చక్రము లంటివి
నిత్యమౌ శమము , దమమను
జోడు ఎద్దుల గడితివి
క్రుత్యమే నీ విధి , ఫలమ్మును
కోరవద్దని అంటివి
భ్రుత్యులను కడ తీర్చవా మరి
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
గట్టివాడవు , పోట్టివాడవు
పుట్ట పర్తిన్ పుట్టితీ
కట్టినాడవు హర్మ్య భవనాల్
మేట్టినాడవుమేలి శిఖరాల్
చుట్టి నాడవు చేయి గాలిలో
మట్టి చక్కర చేయగా
ఇట్టి లీలలు ఎన్నియో మరి
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
భక్త జన చింతామణి
సద్భక్త హృదయ శిఖామణి
శక్తి రూప మహా ఫణి
సంసక్తి నిర్గుణ గ్రామణి
ముక్తి నీయుము మొదమియుము
వ్యక్త భావము లేరుగుమీ ,వి
ముక్తి చేయవే భంధనములను
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
నోచ్చు కనులను , పుచ్చు తనువుల
రగులు ఎదలను , పగులు మదిని
హేచ్చుగాను విభూతి ఇచ్చుచు
హి !ప్రభో దయ చూడవా
ఇచ్చినావట్ వచ్చు వారికి
ఆత్మా లింగము లాదిగా
మేచ్చినారట మేలుగా మరి
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
వన్నె తరగని శాంతి ,సౌఖ్యము
వసుధ లోపల నింపగా
పిన్నతనమున మిన్నగా
చిన్నేలూ చూపిన శ్రీనిదీ
గున్నమావి చెట్టు నీడన
పన్నగేషుని పదమూపై
ఎన్నగా కవితలు పలికిన
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
త్రిగుణ ములను జయించి
బ్రహ్మను చేరగావలె మానవుల్
సుగుణ ములను వరించి
సేవలు చేయగా వలె సోదరులు
సగుణ నిర్గుణ మూర్తి
మంగళ దాయి ,మధురానందకా
నిగమనుత కాషాయ దారి శ్రీ
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
చతుర వాక్పరిపాలకా
చిద్రూప శ్రీ శిర్దిస్వరా
అతుల భద్ర గునార్ణవా
శ్రిత జనేప్సిత దాయికా
గతుకులన్బడి పోవు బ్రతుకుల
గాచి బ్రోవవ పెమతో
జ్ఞాన వ్రాసిన అష్టకంబును
స్వీకరింపవా ప్రేమతో a
సత్య , శివ , సుందర త్రిమూర్తివి శ్రీ
సత్యసాయి మహేశ్వరా (పర్తి )
samaaptam

1 comments:

Sathish said...

Swamy,we love u...

Post a Comment