దేవీనవరాత్రులు -రంగులు

on

దేవీ నవరాత్రులు వస్తున్నాయంటే ఇళ్ళల్లో ,దేవాలయాలలో ఒకటే సందడి. తొమ్మిది రోజులు వరుసగా
చేసుకొనే ఈపూజల పండుగకి ముందే కొన్ని ఏర్పాట్లు చేసుకొని ,ఒక పధకము ఏర్పాటు చేసుకొని దాని ప్రకారము నడుచుకొంటే సులువుగా వుంటుంది. దేవీ నవరాత్రులలో అమ్మవారికి అక్షింతలతో పూజచేస్తాము. ఆఅక్షింతలు
మంచి బియ్యం చూసి, గింజ నడుము విరిగినవి ఏరివేసి పూర్తిగా వున్నా బియ్యపు గింజలనే ఉపయోగించాలి.avi నవరాత్రులకి ముందుగానే ఏరుకొని అట్టి పెట్టుకోవాలి.కొన్ని బియ్యము రామనామము స్మరిస్తూ ఏరుకొని వాటితో
నవరాత్రులలో అమ్మవారికి పాయసం చేసి నైవేద్యము పెడితే మంచిది. పమిడి పట్టి తెచ్చుకొని నలకలు లేకుండా
బాగు చేసుకొని అయుదు వరసలు వుండేలా వత్తులు ,బొడ్డు వత్తులు చేసుకొని ఆవునేతిలొ తడిపి ఒక భరిణెలొ
పెట్టుకొంటే తయారుగా వుంటాయి,నేతిలో నాని ఎక్కువ సేపు దీపం వెలుగుతుంది.
నవరాత్రులలో ఏరోజు ఏరంగు వస్త్రాలు కట్టుకొంటే మంచిదో ఒక చోట చదివాను.
అమ్మవారిని కొందరు పెద్ద విగ్రహాలు చేయించి నవరాత్రులలో ప్రతిష్ట చేసి పూజిస్తారు. ఈరంగులచీరలు అమ్మవారికి కూడా ధరింపచేయ్యాలి
పాడ్యమి -చిలక పచ్చ రంగు
విదియ -నారింజ రంగు
తదియ -పసుపు పచ్చ రంగు
చవితి -ఆకాశ నీలం రంగు
పంచమి -గులాబీ రంగు
షష్టి -గచ్చకాయ రంగు
సప్తమి -ఆకు పచ్చ రంగు
అష్టమి -నేరేడు పండు రంగు
నవమి -కృష్ణ నీలం రంగు
దశమి -ఎర్రరంగు
వీ లయితే ఆచరించండి.
,

0 comments:

Post a Comment