శ్రీ సత్యనారాయణ వ్రత కథ

on

ఎలా మొదలు పెట్టాలి
శ్రీ
సత్యనారాయణ వ్రత కథా గానం
రచన తటవర్తి జ్ఞాన ప్రసూన
శ్రీ సత్యనారాయణ స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు . సత్యనారాయణ వ్రతము ఏకాదశి ,పౌర్ణిమ , మకర సంక్రాంతి మొదలైన రోజులలో
ఎప్పుడయినా చేసుకోవచ్చు .సత్యనారాయణ స్వామి పిలిచితే పలికే దైవం ,భక్తులకి కొంగు బంగారం .
వ్రతం చేయాలంటే బ్రాహ్మణుని పిలిచి బంధువులని
పిలిచి శక్తి కొలది అట్టహాసంగా చేసుకోవచు , ఒకవేళ
ఆలా కుదరక పొతే కుటుంబ సభ్యులు మాత్రం కలసి
చేతనయినంతలో శ్రద్ధగా , భక్తితో చేసుకొనవచ్చు .ఈపూజకి ఏమేమి కా వాలో ముందు
వివరించటం జరిగింది . కథని అయుదు అధ్యాయాలలో చెప్పడం జరిగింది .ఒకోక అధ్యాం ముగియగానే
అరటిపండు నైవేద్యం పెట్టి , కర్పూర హారతి ఇచ్చి
రెండవ అధ్యాయం మొదలు పెట్టాలి . చివరికి రవ్వతో చేసిన ప్రసాదం నివేదన చేయాలి .శ్రద్ధా ,భక్తీ
మనసులో నిండి వుంటే మనం ఏమి పెట్టినా , ఎంత పెట్టినా
స్వామి సీకరిస్తారు .
గోవింద నామాల వరసలో దీనిని పాడుకోవచ్చు .
పుస్తకం ఇప్పటికి మూడు ముద్రణలు అయ్యాయి .విదేశాలలో వున్నా ప్రవాసాంధ్రులకి ఇది ఉపయోగ పడుతుందని
భావిస్తున్నాను .
శ్రీసత్యనారాయణ వ్రత కథా గానం

ప్రతి వరుసలో చివర రమానాథా ,అని చదవాలి .
ఇల్లలికి ముగ్గులుపెట్టి రమానాధా
మామిడి చిగురుల తోరణాల్ కట్టి "
పీట కడిగి పసుపు రాసి "
బియ్యపు పిండితో పద్మం వేసి ''
కుంకుమ తో చుక్కలు పెట్టి ''
కొత్త తుండు దాని పైన వేసి ''
బియ్యం పోసి '
తమల పాకును సవరించి పెట్టి ''
మర చెంబుకు పసుపు రాసి ''
నాల్గు వైపులా కుంకుమ బొట్లు పెట్టి ''
పసుపురాసిన కొత్త నూలు "
మరచెంబుకు చుట్టివేసి '
కలశం లో నాణెం వేసి "
మామిడి కొమ్మలు దానిలో
కొబ్బరికాయను ఒకటి తెచ్చి '
పసుపు రాసి బొట్టు పెట్టి "
క్యలశము లో మధ్యన పెట్టి ''
కొత్తరేవిక మడిచి కిరీటంలా పెట్టి ''
విఘ్నేశ్వరుని తెచ్చి ""
ముందు తమల పాకుపై నుంచి "
అష్ట దిక్పాలకులను "
ఆహ్వానించి పూజించ వలె "
నవ గ్రహములన్ కూడా ''
రప్పించి పెట్టవలె "
సూర్యునకు , చంద్రునకు "
కర్పూర తాంబూల మిచ్చి "
మొదట గణపతి పూజచేసి ''
అవసర నైవేద్య మిచ్చి ''
పాలు ,పెరుగు . నెయ్యి ''
తేనే , అరటి పండ్లు , కొబ్బరి నీళ్లు ''
పంచామ్రుతము చేసి '
స్నా నాలు చేయించి ''
గంగాజలము తోడ స్నానాలు చేయించి ''
తిన్నగా తిలకము దిద్ది ''
వస్త్రము ,యజ్నోపవీతము ఇచ్చి '
హరిద్ర ,కుంకుమ అక్షతలతో '
అందముగా పూజించి '
గంధమలది , ఆభరణాక్శతలు ''
గర్వముగా నర్పించి ''
పరిమళ పుష్ప ములతో ''
సర్వాంగ పూజ చేసి ''
గంధాలు ,పన్నీరు '
కడుముదముతో నిచ్చి ''
సహస్ర నామములు చదివి ''
అక్షతలు ,పుష్పాల పూజచేసి ''
నేతితో వేపినా గోదుమా రవ్వతో ''
పంచదార కలిపి జీడిపప్పు వేసి ''
ఎండు ద్రాక్షలు వేసి ,ఏలకుల్ పొడివేసి ''
ఒలిచిన అరటి పండు పెట్టి ''
ప్రియమైన ప్రసాదమర్పించి ''
కొబ్బరికాయను కొట్టి ''
వివిధ పండ్లతో నైవేద్య మిచ్చి ''
మాపాపము లంతము చేయమని ''
ధూప ,దీపము లందించి ''
షడ్రసోపెతమైన మహానివేదన చేసి ''
మంత్ర పుష్పము చదివి ''
మంగళ హారతి ముదముతోనిచ్చ్చి ''
ఆత్మ ప్రదక్షిణ నమస్కారము చేసి ''
నీవే నా దైవమని ''
అక్షతలు చేత నుంచుకొని ''
శ్రద్దగా నీకద వినవలె ''

ఇప్పుడు వ్రత కథ మొదలు

0 comments:

Post a Comment