శ్రీ సత్యనారాయణ వ్రత కథ - 1

on



కథా ప్రారంభం ప్రధమాధ్యాయం..

ఒకసారి మహామునులందరూ రమానాదా
నైమిశారణ్యమున కూడిరి ''
సూత మహా మునుని చూసి ''
ఇట్లు ప్రశ్నించినారయ్య ''
సకలకష్టములు తొలుగా ''

ఈప్సితార్ధములు కలుగగ ''
వ్రతమేదయినా వుండేనా ''
తపస్సేదయినా తెలుప వయ్య ''
అని మునులు సూత మహా మునినికోరిరి ''
అందుకు సూత మహాముని ''
ఇట్లు వారికి చెప్ప దొడగె ''
పూర్వము ఒకనాడు నారదుడు ''
శ్రీమన్నారాయణుని ప్రశ్నించెను ''
నారదునితో నారాయణుడు ''
చెప్పినదే మీకు చెప్పు చుంటి ''
శ్రద్ధతో ఆలకిమ్పు డనెను ''
ఒకసారి నారద ముని ''
సకలలోకములు తిరుగ జోచ్చే ''
దారిలో భూలోకానికి వచ్చి ''
అచట మానవుల కష్టములు చూసి ''
నారదుడు మిగుల చింతించి ''
వీరి బాధలన్ని పోగొట్టాలి ''
అని అనుకొంటూ నారదుడు ''
విష్ణు లోకమునకు చేరినాడు ''
విష్ణు లోకమున నారదుడుదర్శించి నాడు ''
చతుర్భుజుని ''
తెల్లని శరీర చ్చాయగల విష్ణుని ''
నారదుండు చూచి నాడయ్య ''
మనసారా విష్ణుని చూసి ''
ఇట్లు స్తుతింప సాగేనయ్య ''
ఊహించ లీని రూపమయ్య ''
మాటల కందని మన్మధ మూర్తివి ''
అమిత శక్తి సంపన్నుడవు ''
ఆదిమధ్యాంత రహితుడవు ''
నిర్గునుండవు , నిశ్చలుండవు ''
సర్వ గుణాత్ముడ వయ్య '
ప్రపంచానికి ఆదిమూర్తివి ''
అందమైన ఈసృష్టికి కర్తవు ''
భక్తుల కష్టాల బాపీడి వాడవు ''
నీకు భక్తితో నమస్కరిస్తూ ''
అని నారదుడు స్తోత్రము చేసే ''
సంతసించి నారాయణుడు ''
ఇట్లు చెప్ప దొడగె నారదునికి ''
మునిపుంగవా నారదమునీ ''
నీవు ఇటకు వచ్చిన కారణ మేమి ''
నీమనసులోని కోరిక చెప్పు ''
నీకోరికను నెరవేర్చెదను ''
నారద ముని శ్రీ మహా విష్ణువుతో ''
ఇట్లనే జగత్కర్తా వినవయ్యా ''
భూలోకమున మానవులు ''
నానా యోనులందు పుట్టు చుండిరి ''
నానా బాధలు , కష్టాలు పొందు చుండిరి ''
ఏదైనా ఉపాయం చెప్పు ''
వారికి విముక్తిని కలిగించు ''
సుఖముగా నుండుటకు ''
వారిని రక్షించి దీవించ వయ్య ''
అని నారదుడు నారాయణుని ప్రార్ధించే ''
అందులకు భగవంతుడు ''
ఇట్లు చెప్ప దొడగినాడు ''
ప్రజల మంచి కోరి నీవు ''
ఇట్లు నన్ను అడుగు చున్నావు ''
స్వర్గ మర్త్య లోకములలో ''
దుర్లభ మైన ఒక వ్రతము కలదు ''
దానిని చెప్పు చున్నాను విను ''
అది సత్య నారాయణ వ్రతము ''
భక్తీ , శ్రద్ధలతో దీనిని ''
ఆచరించు వారికి సకల సుఖములు ''
వెంటనే ప్రాప్తించు ''
చివరికి మోక్షము నిక్కమయ్య ''
ఆదివిని నారదుడు ''
ఇట్లు విష్ణువు నడిగినాడు ''
దామోదరా ఆవ్రతము ''
చేసినందువలన ఫలమిన్కెమి ''
అది ఎట్లు చేయ వలయు నయ్యా ''
దీనినిపూర్వ మెవరు చేసినారు ''
దీని నెప్పుడు చేయవలయు నయ్య ''
సవిస్తరముగా తెలుపవయ్య ''
సత్యనారాయణ వ్రతము ''

సకల దుఖ్ఖములు తొలగించు ''
సకల సంపద లభి వృద్ది చేయు ''
సౌభాగ్య వృద్ధి చేయు '
సంతానము ప్రసాదించు ''
సర్వకాల సర్వావస్తాలలో ''
ఈవ్రతము చీసిన జయము నిక్కము ''
వైశాఖ మాసమున గాని ''
కార్తీక మాసమునగాని ''
శుభ దినమున గాని ''
శుభ తిథి యందు గాని ''
యుద్ధమునకు పోవునపుడు ''
ఆపదలు మీదపడిన ''
దరిద్రము మింగ పోయిన ''
ఈవ్రతము చేయ వలయు నయ్య ''
ఆ కష్టములు నాశన మగును ''
ప్రతి మాసం చేయ వచ్చు ''
లేక సంవ్స్తారమున కొకసారి ''
ఎవరి కెంత శక్తి వుంటే ''
అంతశక్తి తోనే చేయవలయు ''
సత్యనారాయణ వ్రతము ''
పూర్ణిమ దినమున చేయ వచ్చు ''
ఏకాదశి నాడైనా చేయ వచ్చు ''
రవి సంక్రమణ దినమందు ''
మిగుల భక్తీ తోడ చీయవలయు ''
వ్రతము చేయువారు ఉదయం నిద్ర లేచి ''
కాలక్రుత్యములను తీర్చుకొని ,శుచియై ''
సత్యనారాయణ స్వామిని తలచుకొని ఇట్లు ''
నీఅనుగ్రహమును పొందకోరి ''
భక్తీ శ్రద్ధలతో వ్రతము చేయ వలయు ''
ధ్యానం చేసి నమస్క రించ వలయు ''
మధ్యాన్నం సమయమున ''
మధ్యాన్న క్రియలు నేరవెర్చుకొని''
సాయంత్రం స్నానం చేసి ''
రాత్రి ప్రారంభ కాలమున ''
ఈవ్రతమును చేయ వలయు ''
పూజాగ్రుహము గోమయముతో అలికి ''
అయిదు రంగుల చూర్ణ ముతో ముగ్గు పెట్టి ''
కొత్త వస్త్రమును పరచి ''
దానిమీద యథాశక్తి బియ్యం పోసి''
బంగారమో ,వెన్దో ,రాగో ''
ఇత్తదిదో ,మట్టిదో ,కలసముచేయించి ''
లోభాత్వము చూపకుండా ''
తన శక్తికి తగ్గ కలశమ్ చేయించి ''
రెవిక బట్ట కిరీటం లాపెట్టి ''
సత్యనారాయణ ప్రతిమను ''
భక్తీ తోనూ ఉంచ వలయు ''
ఒకకర్షం బంగారం కాని ''
అర్ధ కర్షము , లేక పావు కర్షము కాని ''
బంగారంతో ప్రతిమ చేయించి ''
పంచామ్రుతములతో అభిషేకించి ''
మంద పమున ఉంచ వలయు ''
మొదట గణపతిని పూజించ వలయు ''
లక్ష్మి దేవిని , విష్ణు మూర్తిని ''
శివుని , బాలా త్రిపుర సుందరిని ''
సూర్యుని , నవగ్రహాలను ''
ఇంద్రాది అష్ట దిక్పాలకులను ''
అధి దేవత ప్రత్యది దీవతలను ''
మనసారా ఆహ్వానించి పూజించ వలయు ''
విఘ్నేశ్వరుడు మొదలగు వారిని ''
అయిదుగురు దీవతలను ''
కలశమునకు ఉత్తర దిగ్భాగమున ''
మంత్రముతో , ఉదకముతో ''
ప్రతిష్టించి పూజించవలయు ''
దిక్పాలకులనుకూడా ''
ప్రాగాది దిక్కులందు ప్రతిష్టించి ''
వారిని పూజించ వలయు ''
పిదప సత్యనారాయణ మూర్తిని ''

కలశం మీదపూజించ వలయు ''

నాలుగు వర్గములో పురుషులైన స్త్రీలైన ''
ఈవ్రతము చేయ వచ్చును ''
భ్రాహ్మనులు శాస్త్రొస్తకముగా
పూజచేయ వలయును ''
సకలమంత్ర తంత్ర యుక్తముగా ''
పౌరాణికముగా వైదీకముగా ''
బ్రాహ్మణులు పూజించ వలయు ''
భ్రాహ్మనేతరులు ''

పౌరాణికముగా వలయు ''
ఏరోజు నైనా సాయంత్ర మందు ''
జనులు భక్తీ శ్రద్ధలతో ''
శ్రీసత్యనారాయణ వ్రతము చేయ వలయు ''
వ్రతము చేయునప్పుడు ''
బంధువుల భ్రాహ్మణుల పిలువవలె ''
ఆవునీయి ,ఆవుపాలు , అరటి పండ్లు ''
గోధుమనూక ,చక్కర , బెల్లంతెచ్చి ''
ఒక్కొక్కటి సేరుం పావు ''
బియ్యపు నూకైనాసరే ''
స్వామికినైవేద్యం పెట్టవలయు ''
స్వామికి నైవేద్యం పెట్టిన పిదప ''
భ్రాణులకు యథాశక్తి దక్షిణ నివ్వాలి ''
ఆపైన కథ విని అక్షతలు సిరసున దాల్చాలి ''
బ్రాహ్మణుల తో , బంధువులతో ''
కలసి ఆనందంగా విందు చేయాలి ''
శ్రీసత్య నారాయణస్వామికి ''
నృత్య గీతములు వినిపిమ్పవలె ''
భూలోకమున కలి యుగ మందు ''
ఈప్సితార్ధములు పొందుటకు ''
ఇది సులభ మైన చక్కటి మార్గము ''
ప్రధమాధ్యాయము సంపూర్ణం



0 comments:

Post a Comment